నాపై కుట్ర చేసారు.. త్వరలో సంచలన నిజాలు బయట పెడతానంటున్న పృథ్వీ..

అభిమానులు, తిరుమల శ్రీ వెంకన్న దయతో తాను తొందరగా కోలుకుంటాననే నమ్మకం ఉందని పృథ్వీ తెలిపారు.

టీటీడీకి సంబంధించిన మహిళా ఉద్యోగితో కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడినట్టు వచ్చిన ఆడియో టేపులు ఏపీ రాజకీయాలతో పాటు టీటీడీలో పెద్ద కలకలం రేగిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పృథ్వీ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు.

  • Share this:
    టీటీడీకి సంబంధించిన మహిళా ఉద్యోగితో కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడినట్టు వచ్చిన ఆడియో టేపులు ఏపీ రాజకీయాలతో పాటు టీటీడీలో పెద్ద కలకలం రేగిన సంగతి తెలిసిందే కదా. ఈ టేపుల పుణ్యామా అని పృథ్వీ నిక్షేపంగా ఉన్న ఎస్వీబీసీ  చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా పదవి కోల్పోయిన తర్వాత పృథ్వీ తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసాడు. కుట్ర పూరితంగా తనకు ఎస్వీబీసీ నుంచి తప్పించారన్నారు. తనను బయటకు పంపించిన వాళ్లు ఇపుడు పైశాచికానందం పొందుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయమై తాను తీవ్ర మనోసిన ఆందోళనకు గురయ్యానని తెలిపాడు. కాంట్రాక్ట్ పద్ధతి ఉన్న ఉద్యోగులును రెగ్యులరైజ్ చేస్తానని హామి ఇచ్చినందుకే తనపై కావాలనే కుట్ర పన్ని తనను ఈ పదవిలోంచి తొలిగేలా చేసారని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు సజ్జల, విజయసాయి రెడ్డిలకు మాత్రమే జవాబుదారిగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఒక రాజధాని అమరావతి ప్రాంతంలో నిరసన తెలుపుతున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. రాజధాని రైతులను తాను ఎపుడు కించపరిచలేదన్నారు. తాను ఊపిరి ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా స్పష్టం చేసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: