30 Years Prudhvi Raj: ప్రముఖ నటుడు 30 ఇయర్స్ పృథ్వీకి రోడ్డు ప్రమాదం..

నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ (30 years prudhvi raj)

30 Years Prudhvi Raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీ. కొన్ని రోజులుగా వార్తల్లోనే ఉంటున్న ఈయనకు ఇప్పుడు ప్రమాదం జరిగింది. ఈయన కారు రోడ్డు ప్రమాదానికి..

  • Share this:
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీ. కొన్ని రోజులుగా వార్తల్లోనే ఉంటున్న ఈయనకు ఇప్పుడు ప్రమాదం జరిగింది. ఈయన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కూడా కారులోనే ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటికి వచ్చింది. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగిందంటూ పృథ్వీరాజ్‌ టీం ఆయన ఫేస్‌బుక్‌‌లో పోస్ట్ చేసారు. బంజారాహిల్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్‌ వెళ్తుండగా ఓ కారు ఢీ కొట్టిందని.. ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైందని తెలిపారు. చుట్టుపక్కల జనాలు గుమిగూడారంటూ ధ్వంసమైన కారు ఫొటోను షేర్‌ చేసింది పృథ్వీ టీం. అయితే ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలైనా అయ్యాయా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు.

కానీ దీనిపై ఈయన టీం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పృథ్వీ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. ఆ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం సమయంలో కాంట్రవర్సీ జరిగింది. ఆ తర్వాత ఆయన పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు. మొన్నటికి మొన్న మళ్లీ కరోనా బారిన పడి పృథ్వీరాజ్‌ హెడ్ లైన్స్‌లోకి వచ్చాడు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకున్నాడు. 15 రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నాడు పృథ్వీ. ఇప్పుడు యాక్సిడెంట్ వార్తలతో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్.
Published by:Praveen Kumar Vadla
First published: