Sri Reddy: శ్రీ రెడ్డిపై కేస్ పెట్టిన టాలీవుడ్ కొరియోగ్రఫర్..

శ్రీ రెడ్డి యూ ట్యూబ్ ఛానెల్ (sri reddy)

Sri Reddy: శ్రీ రెడ్డి మళ్లీ టాలీవుడ్ టాకింగ్ పాయింట్ అయిపోయింది. నిన్నమొన్నటి వరకు సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. కొన్ని రోజులుగా ఎలాంటి పెంటలు లేకుండా హాయిగా వంటలు..

  • Share this:
శ్రీ రెడ్డి మళ్లీ టాలీవుడ్ టాకింగ్ పాయింట్ అయిపోయింది. నిన్నమొన్నటి వరకు సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. కొన్ని రోజులుగా ఎలాంటి పెంటలు లేకుండా హాయిగా వంటలు చేసుకుంటున్న శ్రీ రెడ్డి.. అభిరామ్ పోస్టుతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. రామానాయుడు స్టూడియోస్‌ను సురేష్ బాబు ప్రముఖ కన్సస్ట్రక్షన్ కంపెనీ మీనాక్షికి అమ్మేసాడని తెలుస్తుంది. అక్కడ ప్లాట్స్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. శ్రీ రెడ్డి సంచలన పోస్ట్ పెట్టింది. తనకు అభిరామ్‌కు ఫస్ట్ నైట్ అక్కడే జరిగిందని ఈమె చేసిన పోస్ట్ వైరల్ అయిపోయింది. ఆ తర్వాత నటి కరాటే కళ్యాణి ఈమెపై పోలీస్ కేస్ పెట్టింది.
శ్రీ రెడ్డిపై కేస్ పెట్టిన రాకేష్ మాస్టర్ (sri reddy rakesh master)
శ్రీ రెడ్డిపై కేస్ పెట్టిన రాకేష్ మాస్టర్ (sri reddy rakesh master)

తెలుగు ఇండస్ట్రీ పరువు తీసేలా దిగజారిపోయి అసభ్యకరంగా మాట్లాడుతుందని.. తనపై కూడా సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడిందంటూ ఈమె సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొరియోగ్రఫర్ కూడా శ్రీ రెడ్డిపై కేస్ ఫైల్ చేసాడు. ఆయన మరెవరో కాదు.. ఒకప్పటి స్టార్ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ కొరియోగ్రఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్‌కు స్వయానా గురువు ఈయన. శేఖర్ చేతిపై కూడా రాకేష్ మాస్టర్ అని పచ్చబొట్టు ఉంటుంది.
శ్రీ రెడ్డిపై కేస్ పెట్టిన రాకేష్ మాస్టర్ (sri reddy rakesh master)
శ్రీ రెడ్డిపై కేస్ పెట్టిన రాకేష్ మాస్టర్ (sri reddy rakesh master)

ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీ రెడ్డి తనను దూషించిందంటూ.. సోషల్ మీడియాలో తన గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టిందంటూ ఆమెపై పోలీస్ కేస్ పెట్టాడు రాకేష్ మాస్టర్. తనను ఇష్టమొచ్చినట్లు తిట్టి పరువు తీసిందని ఆయన పేర్కొన్నాడు. ఆమెపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని రాకేష్ మాస్టర్ పోలీసులను కోరాడు. మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఎలాగైనా శ్రీ రెడ్డి నోరు మూయించాలని ప్రయత్నిస్తున్నారు. మరి వీళ్ల ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: