Mikhail Gandhi: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా తన అద్భుతమైన నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. కొందరు నటించినది కేవలం కొన్ని సినిమాలలో అయినప్పటికీ ఆ పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ఒకరే మైఖేల్ గాంధీ..మైఖేల్ గాంధీ అంటే బహుశా గుర్తుపట్టక పోవచ్చు కానీ హలో సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కుర్రాడు అంటే మాత్రం అందరికీ వెంటనే గుర్తొస్తారు.హలో సినిమా ద్వారా ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం...
సుప్రీమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన మైఖేల్ గాంధీ వయస్సు అప్పుడు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే.చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మైఖేల్ గాంధీ కేవలం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా శ్రీలంక, పాకిస్తాన్ కి చెందిన పలు యాడ్స్ లో కూడా నటించారు. మైఖేల్ గాంధీకీ యాడ్స్ లో నటించడం కన్నా తనకి సినిమాల్లో నటించడం ఎంతో ఇష్టమని తెలియజేశారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ చిత్రంలో నటించి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఎ బిలియన్ డ్రీమ్స్ లో మైఖేల్ నటన తర్వాత సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమాలో అవకాశం రావడానికి ముందు తన కంటే కొన్ని వేల మంది చైల్డ్ ఆర్టిస్ట్ లను చూసిన తర్వాత మైఖేల్ గాంధీని సెలెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మైకేల్ ఏ ప్రాంతానికి వెళితే అక్కడ పెద్ద ఎత్తున జనాలు ఉండేవారు. అప్పటికే అంతా అభిమానాన్ని సంపాదించుకున్నారు.
ఈ విధంగా మైఖేల్ గాంధీ సుప్రీమ్,ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమాలలో తన నటనని చూసి నాగార్జున చూసి "హలో" సినిమాలో అఖిల్ చిన్నప్పటి పాత్ర కోసం మైఖేల్ గాంధీనీ సెలెక్ట్ చేసారు. ఇక హలో సినిమాలో తన నటన చూసి ఎంతో మంది అతనికి ప్రశంసలు కురిపించారు.తను భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడని, త్వరలోనే ఈ బాల నటుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ అతనిపై ప్రశంస కురిపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: A billion dreams films, Akhil Akkineni, Hello film, Mikhail Gandhi, Tollywood