Sampath Raj: తెలుగు సినీ నటుడు సంపత్ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు. విలన్ గా, పోలీస్ గా ఎక్కువ పాత్రల్లో నటించే సంపత్ రాజ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీస్ పాత్ర అంటే చాలు సంపత్ రాజ్ గుర్తొచ్చేలా అయన నటించారు. శ్రీమంతుడు, దమ్ము, మిర్చి, లౌక్యం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ రాజ్ నిజజీవితం గురించి తెలిస్తే ఎవరైన సరే షాక్ అవుతారు.
సంపత్ రాజ్ వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. నిజానికి ఈయన మొదటి భార్య ప్రముఖ తమిళ నటి శరణ్య పొన్వన్నన్. చిన్న వయసులోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో వారి ఆలోచనలు కలవలేదని ఇద్దరి సమ్మతితోనే విడిపోయారు. వీళ్ళు విడిపోయిన తర్వాత కూతురును తన వద్దే ఉంచేసుకున్నాడు. ఇక ఈ విషయంపైనే సంపత్ రాజ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సంపత్ రాజ్ కూతురు వయసు ఇప్పుడు 22 ఏళ్ళు. తన కస్టడీలోనే తన కూతురును తీసుకున్నాడట. ఇక ఆమె బాగోగులు మొత్తం ఓ తండ్రిలా కాకుండా తల్లిలా కూడా చేసుకుంటాడట. ఇక ఏ అమ్మాయికైన వయసు వచ్చినప్పుడు అవసరాలు మారుతాయి కాబట్టి తన కూతురు వయస్సుకు వచ్చినప్పుడు కూడా అవసరాలు మారాయని తెలిపాడు. తనలో బయోలాజికల్ మార్పులు వచ్చినందున తన కూతురి విషయంలో తను తన సహనాన్ని నర్చుకున్నాడట. ఇక తన కూతురుకు మెడికల్ షాప్ నుంచి శానిటరీ ప్యాడ్స్ కొనడానికి ఆయన ఎప్పుడు సిగ్గు పడలేదట.
అసలు అది తనకు సమస్యగా అనిపించ లేదు అని తెలిపాడు. ఇక ఆ విషయం గురించి తాను ముందే చదివేశాను అంటూ, తన కూతురుతో డిస్కస్ చేయగలనని తెలిపాడు. ఇక తను, తన కూతురు మంచి స్నేహితులుగా ఉంటారట. వారిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవని.. అమ్మాయిని పెంచిపెద్ద చేసే విషయంలో తన అన్న వదిన, స్నేహితులు, తన సోదరి తనకు మద్దతు ఇచ్చారట. ఈ తన కూతురు సైకాలజీ డిగ్రీ చేసిందని, పోస్ట్ గ్రాడ్యుయేట్ కు ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధంగా ఉందని తెలిపాడు. ఇక తన నటన గురించి తన కూతురు సినిమా చూశాక ఇలా చేసి ఉంటే బాగుంటుందని చెబుతుందట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actress saranya, Dammu, Mirchi film, Srimanthudu, Tollywood actor