Home /News /movies /

TOLLYWOOD CELEBRITIES SALUTE TO CONDOLENCES TO SOLDIERS TA

సరిలేరు మీకెవ్వరు.. వీర సైనికులకు మహేష్ సహా టాలీవుడ్ సెల్యూట్..

భారత జవాన్లకు టాలీవుడ్ బిగ్ సెల్యూట్  కల్నల్ సంతోష్, కుందన్, పళని (File/Photos)

భారత జవాన్లకు టాలీవుడ్ బిగ్ సెల్యూట్ కల్నల్ సంతోష్, కుందన్, పళని (File/Photos)

లద్దాఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు చనిపోయారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశ సేవలో అమరులైన వీర జవానులకు మహేష్ బాబు సహా టాలీవుడ్ నివాళులు అర్పించింది.

ఇంకా చదవండి ...
లద్దాఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు చనిపోయారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాదు చైనా సైనికులతో భారత సైనికులకు జరిగిన ఘర్షణలో ఇరువైపున భారీగానే ప్రాణ నష్టం సంభవించింది. దేశ సరిహద్దు రక్షణలో భాగంగా అమరులైన సైనికులకు దేశ వ్యాప్తంగా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. అటు టాలీవుడ్‌కు చెందిన మహేష్ బాబుతో పాటు వరుణ్ తేజ్, మంచు విష్ణు, తమన్నా భాటియా, సుశాంత్, నిఖిల్ సిద్ధార్ధ్ అనిల్ సుంకరతో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, గుణ శేఖర్, గోపీమోహన్ పాటు  పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ సహా పలువురు  సెలబ్రిటీలు కూడా దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించడంతో పాటు వారి సేవలను కొనియాడారు.





























Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: India-China, Indian Army, Indo China Tension, Soldier, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు