Tollywood flight landing: టాలీవుడ్‌ను వణికించిన ఈ విమాన ప్రమాదం గురించి తెలుసా..?

టాలీవుడ్ ఫ్లైట్ ల్యాండింగ్ (Tollywood flight accident)

Tollywood flight landing: తెలుగు ఇండస్ట్రీలో ఒకరు ఇద్దరూ కాదు.. ఏకంగా 60 మంది ప్రముఖులు వాళ్ల కుటుంబ సభ్యులు. వాళ్లతో పాటు తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు.. అంతా కలిపి 272 మంది ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం. అలాంటి విమానానికి పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా కలలో కూడా ఊహించని నష్టం జరుగుతుంది.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఒకరు ఇద్దరూ కాదు.. ఏకంగా 60 మంది ప్రముఖులు వాళ్ల కుటుంబ సభ్యులు. వాళ్లతో పాటు తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు.. అంతా కలిపి 272 మంది ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం. అలాంటి విమానానికి పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా కలలో కూడా ఊహించని నష్టం జరుగుతుంది. దాన్ని మరిచిపోవడానికి తరాలు కావాల్సిందే. అలాంటి దారుణానికి కాస్త దూరంలో ఓ ప్రమాదం జరిగింది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు మరికొందరు ప్రముఖులతో కలిసి వెళ్తున్న విమానం అనుకోని అత్యవసర ల్యాండింగ్ అయింది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వింత జరగలేదేమో మరి..? 272 మంది ప్రయాణికులతో ఉన్న ఓ విమానం నేలపై పడిన తర్వాత కూడా అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. 1993 నవంబర్‌ 15న జరిగిన ఈ సంఘటన టాలీవుడ్‌తో పాటు యావత్ సినీ ప్రపంచాన్ని వణికించింది. కళ్ళు మూసి తెరిచేలోపు ఊహించని దారుణం నుంచి తప్పించుకుని అంతా ప్రాణాలతో బయటపడ్డారు.

చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో 272 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్‌‌కు బయలు దేరారు. ఇందులో 64 మంది సినీ ప్రముఖులు.. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, మాలాశ్రీ, అల్లు రామలింగయ్య దంపతులు, సుధాకర్‌, బ్రహ్మానందం, కాస్టూమ్స్‌ కృష్ణ, దర్శకుడు బాపు, కోడి రామకృష్ణ, ఎస్‌వి కృష్ణారెడ్డి, ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి నారాయణరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్‌.డి. సుందర్‌, నిర్మాత కె. సి. శేఖర్‌ బాబు, కాట్రగడ్డ ప్రసాద్‌, రాశీ మూవీస్‌ నరసింహారావు, నృత్య దర్శకురాలు సుచిత్ర, ఫైట్‌ మాస్టర్‌ సూపర్‌ సుబ్బరాయన్‌, ఛాయాగ్రాహకుడు కె. ఎస్‌ హరి, అనుమోలు హరి, చిరంజీవి పర్సనల్‌ మేకప్‌మెన్‌ శివ వంటి వాళ్ళు ప్రయాణిస్తున్నారు.

tollywood celebs,tollywood flight accident,telugu industry flight landing,tollywood flight landing accident,1993 tollywood flight landing,telugu cinema,టాలీవుడ్ ప్రముఖులు,టాలీవుడ్ ఫ్లైట్ యాక్సిడెంట్,టాలీవుడ్ విమానం అత్యవసర ల్యాండింగ్
టాలీవుడ్ ఫ్లైట్ ల్యాండింగ్ (Tollywood flight accident)


విమానం గాల్లో ఉన్న సమయంలోనే రెక్కలకు ఉండే ప్లాప్స్‌, స్లాట్స్‌ హైదరాబాద్‌ ఎయిర్ పోర్టులో లాండింగ్‌ కోసం తెరుచుకోగా వాతావరణం సహకరించకపోవడంతో వర్కవుట్ కాలేదు. దీంతో మళ్ళీ పైకి ఎగురుతున్న సమయంలోనే సాంకేతిక లోపం వచ్చింది. అదే సమయంలో ఇంధన లోపం కూడా సంభవించింది. అలాంటి సమయంలో సాధారణంగా ఫ్లైట్ క్రాష్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలిపారు. అయితే ఏ దేవుడో కరుణించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

tollywood celebs,tollywood flight accident,telugu industry flight landing,tollywood flight landing accident,1993 tollywood flight landing,telugu cinema,టాలీవుడ్ ప్రముఖులు,టాలీవుడ్ ఫ్లైట్ యాక్సిడెంట్,టాలీవుడ్ విమానం అత్యవసర ల్యాండింగ్
టాలీవుడ్ ఫ్లైట్ ల్యాండింగ్ (Tollywood flight accident)


కెప్టెన్‌ భల్లా, కో పైలెట్‌ వేల్‌రాజ్‌ తమ సమయస్ఫూర్తితో వెంకటగిరి సమీపంలోని వెల్లంపాడు బట్టలపల్లి, గుండ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న పొలాల్లో విమానాన్ని ల్యాండ్‌ చేశారు. ఆ ల్యాండింగ్ కాస్త ముందు జరిగినా కూడా పెద్ద చెరువులో పడిపోయేది.. లేదంటే కరెంట్‌ తీగల మీద పడి ఘోర ప్రమాదం సంభవించేది. ఒక్కోసారి ఆ ప్రమాదం గురించి తలుచుకుంటేనే మన సినీ ప్రముఖులు వణికిపోతుంటారు.
Published by:Praveen Kumar Vadla
First published: