news18-telugu
Updated: August 15, 2020, 10:52 AM IST
భారత జాతీయ పతాకం (ప్రతీకాత్మక చిత్రం)
74వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాన మంత్రి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగరవేసారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ కళకారులు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన దేశ భక్తులతో పాటు దేశాన్ని అనుక్షణం కాపాడే అమర జవానుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన శుభతరుణం ఇది. ఈ సందర్భంగా టాలీవుడ్ అగ్ర నటులైన మోహన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాన్, రవితేజ, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, సుధీర్ బాబు, జగపతి బాబు, అఖిల్‌తో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
మరోవైపు దేశ వ్యాప్తంగా ప్రజలు 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 15, 2020, 10:52 AM IST