హోమ్ /వార్తలు /సినిమా /

‘కథానాయకుడు’కి పొగడ్తల వర్షం..మహేష్, బ్రాహ్మణి సహా పలువురి ప్రశంసల ఝల్లు

‘కథానాయకుడు’కి పొగడ్తల వర్షం..మహేష్, బ్రాహ్మణి సహా పలువురి ప్రశంసల ఝల్లు

NTR కథానాయకుడిపై ప్రశంసల ఝల్లు

NTR కథానాయకుడిపై ప్రశంసల ఝల్లు

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ విన్నా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ పేరే వినిపిస్తుంది. ఈ చిత్రం గురించి సెలబ్రెటీలు ఇటు సామాన్య ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నారా వారి కోడలు ...‘ఎన్టీఆర్ కథానాయకుడు’ పాత్రధారి బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణితో పాటు స్వర్గీయ హరికృష్ణ కూతురు  ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు.

ఇంకా చదవండి ...

  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ విన్నా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ పేరే వినిపిస్తుంది. ఈ చిత్రం గురించి సెలబ్రెటీలు ఇటు సామాన్య ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కనపెడితే అన్నగారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన క్రిష్‌కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు బాలయ్య తన తండ్రిపాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారని పలువరు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.


  ఇప్పటికే మహష్ బాబుతో పాటు కే.రాఘవేంద్రరావు, ఏపీ మంత్రి సోమిరెడ్డి సహా పలువురు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు సుధీర్ బాబు, కోన వెంకట్, హరీష్ శంకర్ వంటి దర్శకులు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ను మెచ్చుకుంటున్నారు.


  తాజాగా నారా వారి కోడలు ...‘ఎన్టీఆర్ కథానాయకుడు’ పాత్రధారి బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణితో పాటు స్వర్గీయ హరికృష్ణ కూతురు  ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు. అంతేకాదు తాతయ్య పాత్రలో బాలకృష్ణ నటనతో పాటు క్రిష్ టేకింగ్‌ను మెచ్చుకున్నారు. మొత్తానికి తెలుగు వారందరూ తప్పక చూడాల్సిన సినిమా అంటూ కితాబు ఇచ్చారు.

  First published:

  Tags: Balakrishna, Mahesh, NT, NTR Biopic, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు