Telugu Best Anchors: తెలుగు ఇండస్ట్రీలో వెండితెరపై నటీనటుల పాత్ర సినిమాల్లో ఎంత ముఖ్యమో.. బుల్లితెరపై యాంకర్ ల పాత్ర కూడా టీవీ షోలకు అంత ముఖ్యం. ఇక ఇప్పటికే ఎంతోమంది టీవీ యాంకర్లు ఉండగా వాళ్లు వెండితెరపై కూడా మెప్పించారు. ఇదిలా ఉంటే వాళ్ళు ఒకప్పటి రియాల్టీ షో నుండి ఇప్పటికీ వాళ్ల యాంకరింగ్ తో బుల్లితెర షో లలో మెప్పిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు మంచి గుర్తింపు తో కెరీర్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసుకుందాం.
సుమ కనకాల: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరమే లేదు.ఎన్నో ప్రోగ్రామ్స్, ఫిలిమ్స్, టీవీ షోస్ వంటి వాటిలో యాంకరింగ్ తో బాగా మెప్పించింది. ఇప్పటికీ.. ఇక ముందు కూడా తను ఇండస్ట్రీ లో కొనసాగుతూనే వుంది. కాష్, స్టార్ మహిళా, కనెక్షన్, బలే ఛాన్సెలే వంటి వాటితో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఝాన్సీ లక్ష్మి : ఒకప్పటి యాంకర్ ఝాన్సీ. తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈమె సినిమాలలో నటించి, ఎన్నో టెలివిజన్ షో లలో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఈమె ఏటీఎం, సండే సందడి, బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర, సరదా, వర్షం, పెళ్లి పుస్తకం ఇలా ఎన్నో రకాల షోలలో బాగా ఆకట్టుకుంది.
రవి: బుల్లితెర మేల్ యాంకర్ రవి.ఇప్పటికీ యాంకరింగ్ చేస్తూ ఓ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఈయన ఒకప్పుడు సంథింగ్ స్పెషల్ వంటి బుల్లితెర షో నుండి వెండితెర లో కూడా మెప్పించాడు. ఆ షో తోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న రవి కిరాక్, డీ జూనియర్స్, అలీ టాకీస్ వంటి వాటిలో మంచి గుర్తింపు అందుకున్నాడు.
ఉదయభాను : ఒకప్పటి ఈ బుల్లితెర యాంకర్ ఉదయభాను. తెలంగాణ యాసతో ఎంతో మంది ప్రేక్షకులను ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో టీవీ ఛానల్ లో యాంకర్ గా తన చక చక మాటలతో బాగా మెప్పించింది. ఆమె వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రాం, జానవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం గాను, ఢీ షో లల్లో యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంది.
ప్రదీప్ మాచిరాజు: ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన రేడియో మిర్చి ఎఫ్ఎం ఛానల్ ద్వారా కెరీర్ లో అడుగు పెట్టి ఆ తర్వాత బుల్లితెర, వెండితెరపైతన టాలెంటు ను నిరూపించుకున్నాడు. ప్రదీప్ దర్బార్ అనేషో తో మంచి క్రేజ్ ను అందుకున్నాడు. అంతేకాకుండా గడసరి అత్త సొగసరి కోడలు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా వంటి పలు షో లలో హోస్టింగ్ తో గుర్తింపు అందుకున్నాడు.
లాస్య :ఒకప్పటి యాంకర్ లాస్య. యాంకర్ రవి తో కలిసి సంథింగ్ స్పెషల్ తో బాగా పాపులర్ గా మారింది. ఇక ఆ తర్వాత వన్, మొండి మొగుడు పెంకి పెళ్ళాం వంటి పలు షో లలో యాంకరింగ్ చేయగ తన పెళ్లి తర్వాత బుల్లి తెరకు దూరమైంది. ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ బుల్లితెరలో కనిపిస్తుంది ఈ బ్యూటీ.
అనసూయ భరద్వాజ్: ప్రస్తుతం గ్లామర్ బ్యూటీ క్రేజ్లో ఉన్న యాంకర్ అనసూయ.. అటు వెండితెరపై కూడాఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక ఈమె జబర్దస్త్ షోలో తన యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఈమె గతంలో సాక్షి న్యూస్ ఛానల్ లో కూడా యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే.
శ్రీముఖి : బుల్లితెర లో మరో గ్లామర్ యాంకర్ శ్రీముఖి అని చెప్పవచ్చు. యాంకర్ రవి తో కలిసి తను చేసిన అల్లరుల గురించి అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాల్లో కూడా నటించిన శ్రీముఖి బుల్లితెర షోల్లో యాంకరింగ్ గా బాగా గుర్తింపు పొందింది. తను పటాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor anasuya bhardwaj, Anchor lasya, Anchor pradeep machiraju, Anchor ravi, Anchor Sreemukhi, Jhansi lakshmi, Telugu anchors, Tollywood, Udaya banu