హోమ్ /వార్తలు /సినిమా /

Tamannaah Love failure: తమన్నాను మోసం చేసిందెవరు.. లవ్ ఫెయిల్యూర్‌కు కారణం ఆ హీరోనేనా..?

Tamannaah Love failure: తమన్నాను మోసం చేసిందెవరు.. లవ్ ఫెయిల్యూర్‌కు కారణం ఆ హీరోనేనా..?

తమన్నా లేటెస్ట్ ఫోటో (Instagram/Photo)

తమన్నా లేటెస్ట్ ఫోటో (Instagram/Photo)

Tamannaah Love failure: అవునా.. నిజంగా తమన్నా లవ్ ఫెయిల్యూరా..? ఆమె ప్రేమలో ఓడిపోయిందా.. ఇదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? అవును వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా నిజంగా ప్రేమలో ఓడిపోయింది.

అవునా.. నిజంగా తమన్నా లవ్ ఫెయిల్యూరా..? ఆమె ప్రేమలో ఓడిపోయిందా.. ఇదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? అవును వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా నిజంగా ప్రేమలో ఓడిపోయింది. ఈ విషయం వాళ్లు వీళ్లు చెప్పడం కాదు.. తమన్నానే చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె స్యామ్ జామ్ షోకు వచ్చింది. ఆహాలో సమంత ఈ షోను హోస్ట్ చేస్తుంది. అందులోకి చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. సమంత అడిగే ప్రశ్నలకు వాళ్లంతా చాలా సరదాగా సమాధానాలు చెప్తున్నారు. ఇదివరకే ఈ షోకు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి లాంటి హీరోలు వచ్చారు. ఇప్పుడు తమన్నా వచ్చింది. అందులో కూడా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది సమంత. దానికి తమన్నా కూడా అంతే స్ట్రెయిట్ సమాధానాలు చెప్పింది. ఏంటి నీ సోషల్ మీడియా పోస్టులలో చాలా కవిత్వం కనిపిస్తుంది అంటే ప్రేమలో విఫలం అయితే.. హార్ట్ బ్రేక్ అయితే ఇలాంటి కవితలే వస్తాయంటూ చెప్పింది తమన్నా. అలా తను ప్రేమలో ఓడిపోయానని చెప్పింది ఈ మిల్కీ బ్యూటీ. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి.. ఆ తర్వాత విఫలమయ్యాయనని చెప్పింది తమన్నా.

tamannaah,tamannaah twitter,tamannaah love story,tamannaah love failure,tamannaah sam jam show,tamannaah sam jam samantha akkineni talk show,tamannaah karthi love story,tamannaah movies,tamannaah hot photos,telugu cinema,తమన్నా,తమన్నా హాట్ ఫోటోస్,తమన్నా స్యామ్ జామ్ టాక్ షో,తమన్నా లవ్ ఫెయిల్యూర్
సమంత టాక్ షోలో తమన్నా (Twitter/Photo)

దాంతో వెంటనే అంత ధైర్యం ఎవరు చేసారు.. తమన్నా హార్ట్ బ్రేక్ చేసేంత దమ్ము ఎవరికి ఉందంటూ రెచ్చిపోయింది సమంత. చెప్పు.. ఎవరో చెప్పు.. నీ గుండె బద్ధలు కొట్టిందెవరో చెప్పు అంటూ ప్రశ్నించింది సమంత అక్కినేని. దానికి ఆమె నవ్వేసి ఊరుకుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం చాలా మందికి ఐడియా ఉంటుంది. కొన్నేళ్ల కింద ఈమె ఓ తమిళ హీరోతో ప్రేమలో ఉంది.. కొన్ని రోజుల పాటు వాళ్లు బాగానే ప్రేమించుకున్నారనే టాక్ కూడా నడిచింది.. ఆయనతో ఎఫైర్ ఉండేదని.. ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించగానే ఒకరిపై ఒకరికి యిష్టం కూడా కలిగిందని ప్రచారం జరిగింది.

tamannaah,tamannaah twitter,tamannaah love story,tamannaah love failure,tamannaah sam jam show,tamannaah sam jam samantha akkineni talk show,tamannaah karthi love story,tamannaah movies,tamannaah hot photos,telugu cinema,తమన్నా,తమన్నా హాట్ ఫోటోస్,తమన్నా స్యామ్ జామ్ టాక్ షో,తమన్నా లవ్ ఫెయిల్యూర్
తమన్నా ఫోటో (tamannaah/instagram)

పెళ్లి కూడా చేసుకుంటారేమో అనే వార్తలు కూడా వచ్చాయి. తమన్నా కూడా ఆ హీరోను బాగానే యిష్టపడిందని.. అతన్నే పెళ్లి చేసుకోవాలని కలలు కూడా కనిందని సన్నిహితులు చెప్తుంటారు. అయితే అలాంటి హీరో ఉన్నట్లుండి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో తమన్నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అప్పట్నుంచే ఈ కవితలు మొదలయ్యాయి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Samantha akkineni, Tamannah, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు