సాయిపల్లవికి వార్నింగ్ ఇచ్చిన సమంత అక్కినేని..

సమంత భర్త నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ సహా, ఫస్ట్ లుక్‌ను నిన్న విడుదల చేశారు.

news18-telugu
Updated: January 15, 2020, 1:28 PM IST
సాయిపల్లవికి వార్నింగ్ ఇచ్చిన సమంత అక్కినేని..
సాయిపల్లవి, నాగ చైతన్య (Love Story movie)
  • Share this:
సమంత భర్త నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ సహా, ఫస్ట్ లుక్‌ను నిన్న విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో నాగ చైతన్య, సాయిపల్లవి భావోద్వేగంలో ఉన్నట్లు కనిపిస్తారు. అయితే, ఆ పోస్టర్‌లో సాయిపల్లవి నాగచైతన్య కాలర్ పట్టుకొని ఉంటుంది. ఈ పోస్టర్‌పై అభిమానులు స్పందించారు. అందులో సమంత కూడా ఉంది. ఈ పోస్టర్‌పై తనదైన శైలిలో స్పందించింది.

లవ్ స్టోరీ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సమంత.. ఆ పక్కనే మరో పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో షర్ట్ వదులు అని బ్రహ్మానందం కత్తితో హెచ్చరిస్తున్నట్లు ఉన్న ఫోటోను జత చేసింది. నా భర్త కాలర్ పట్టుకుంటావా? వదిలేయ్.. అన్నట్లు సాయిపల్లవికి సమంత వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంది. సమంత ఈ ఫన్నీ మీమ్ పోస్ట్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

సమంత పోస్ట్ చేసిన మీమ్
Published by: Shravan Kumar Bommakanti
First published: January 15, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading