TOLLYWOOD BEAUTY SAMANTHA AKKINENI WARNS HEROINE SAI PALLAVI BS
సాయిపల్లవికి వార్నింగ్ ఇచ్చిన సమంత అక్కినేని..
సాయిపల్లవి, నాగ చైతన్య (Love Story movie)
సమంత భర్త నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ సహా, ఫస్ట్ లుక్‌ను నిన్న విడుదల చేశారు.
సమంత భర్త నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ సహా, ఫస్ట్ లుక్‌ను నిన్న విడుదల చేశారు. ఆ పోస్టర్లో నాగ చైతన్య, సాయిపల్లవి భావోద్వేగంలో ఉన్నట్లు కనిపిస్తారు. అయితే, ఆ పోస్టర్లో సాయిపల్లవి నాగచైతన్య కాలర్ పట్టుకొని ఉంటుంది. ఈ పోస్టర్‌పై అభిమానులు స్పందించారు. అందులో సమంత కూడా ఉంది. ఈ పోస్టర్‌పై తనదైన శైలిలో స్పందించింది.
లవ్ స్టోరీ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సమంత.. ఆ పక్కనే మరో పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో షర్ట్ వదులు అని బ్రహ్మానందం కత్తితో హెచ్చరిస్తున్నట్లు ఉన్న ఫోటోను జత చేసింది. నా భర్త కాలర్ పట్టుకుంటావా? వదిలేయ్.. అన్నట్లు సాయిపల్లవికి సమంత వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంది. సమంత ఈ ఫన్నీ మీమ్ పోస్ట్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
సమంత పోస్ట్ చేసిన మీమ్
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.