Home /News /movies /

TOLLYWOOD BEAUTY KAJAL AGGARWAL TURNS PROSTITUTE CUM SPY FOR NAGARJUNA PRAVEEN SATTARU MOVIE PK

Kajal Aggarwal: వేశ్య పాత్రలో కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత చందమామ సంచలన పాత్ర..

కాజల్ అగర్వాల్ (Kajal aggerwal  Photo)

కాజల్ అగర్వాల్ (Kajal aggerwal Photo)

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ఇప్పటి వరకు కెరీర్‌లో చాలా పాత్రలు చేసింది కానీ వేశ్య పాత్రలో మాత్రం నటించలేదు. తెలుగులో అనుష్క శెట్టి(Anushka Shetty) లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా ఆ కారెక్టర్ చేసారు కానీ కాజల్ అగర్వాల్‌కు మాత్రం ఇప్పటి వరకు ఆ ఛాన్స్ రాలేదు.

ఇంకా చదవండి ...
కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు కెరీర్‌లో చాలా పాత్రలు చేసింది కానీ వేశ్య పాత్రలో మాత్రం నటించలేదు. తెలుగులో అనుష్క శెట్టి లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా ఆ కారెక్టర్ చేసారు కానీ కాజల్ అగర్వాల్‌కు మాత్రం ఇప్పటి వరకు ఆ ఛాన్స్ రాలేదు. పెళ్లైంది కదా.. ఇకపై వచ్చినా కూడా అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోదు అనుకున్నారంతా. కానీ తాను మాత్రం అలా కాదు.. కారెక్టర్ నచ్చితే ఏం చేయడానికైనా సిద్ధమే అంటుంది చందమామ. ముఖ్యంగా ఇప్పుడు చేసి చూపిస్తుంది కూడా. ఎందుకంటే ప్రస్తుతం ఈమె వేశ్య పాత్రలో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. తెలుగులో వరస సినిమాలు చేస్తుంది కాజల్. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాతో పాటు చిరంజీవి ఆచార్య సినిమాలోనే కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మరోవైపు తమిళం, హిందీలోనూ కాజల్ నటిస్తుంది. పెళ్లి తర్వాత కూడా విభిన్న పాత్రలను ఎంచుకుంటుంది కాజల్. ఇప్పుడు నాగ్-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ స్పై పాత్రలో నటిస్తుంది.

అంతేకాకుండా ఈ పాత్రలో మరో వేరియేషన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అదే వేశ్య.. అవును వేశ్య పాత్రలో నటిస్తుంది కాజల్. స్పైగానే కాకుండా వేశ్యగా ఎందుకు నటిస్తుందబ్బా అనుకోవచ్చు.. ఇక్కడే అసలు మ్యాటర్ దాచేసాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.
Kajal Aggarwal,Kajal Aggarwal twitter,Kajal Aggarwal instagram,Kajal Aggarwal movies,Kajal Aggarwal prostitute,Kajal Aggarwal spy prostitute,Kajal Aggarwal nagarjuna praveen sattaru movie,Kajal Aggarwal acharya chiranjeevi,telugu cinema,Kajal Aggarwal hot photos,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,కాజల్ అగర్వాల్ వేశ్య పాత్ర,కాజల్ అగర్వాల్ స్పై కమ్ వేశ్య పాత్ర నాగార్జున ప్రవీణ్ సత్తారు సినిమా
Nagarajuna and kajal Photo : Twitter

నాగార్జున ఇందులో రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఆయనకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. సినిమాలో ఈమె ఎక్కువ భాగం వేశ్యగా.. చివర్లో మాత్రం స్పైగా కనిపించబోతుందని తెలుస్తుంది. తీవ్రవాదుల నుంచి రహస్యాలు రాబట్టడానికి.. తన గ్లామర్‌ను ఎరగా వేసి వాళ్లను ఆకట్టుకుంటూ అక్కడ్నుంచి కీలక సమాచారాన్ని నాగార్జునకు చేరవేసే పాత్ర ఇది. ప్రవీణ్ సత్తారు ఈ పాత్రను చాలా అద్భుతంగా డిజైన్ చేసాడని తెలుస్తుంది.
Kajal Aggarwal,Kajal Aggarwal twitter,Kajal Aggarwal instagram,Kajal Aggarwal movies,Kajal Aggarwal prostitute,Kajal Aggarwal spy prostitute,Kajal Aggarwal nagarjuna praveen sattaru movie,Kajal Aggarwal acharya chiranjeevi,telugu cinema,Kajal Aggarwal hot photos,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్,కాజల్ అగర్వాల్ వేశ్య పాత్ర,కాజల్ అగర్వాల్ స్పై కమ్ వేశ్య పాత్ర నాగార్జున ప్రవీణ్ సత్తారు సినిమా
కాజల్ అగర్వాల్ Instagram

పెళ్లి తర్వాత వేశ్యగా నటించడం అనేది చిన్న విషయం కాదు. కానీ కాజల్ మాత్రం పెళ్లికి, నటనకు సంబంధం లేదంటుంది. అందుకే కారెక్టర్ నచ్చింది కాబట్టే చేస్తున్నానంటుంది. ఇందులో కాజల్ కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేయబోతుంది. మరి గూడఛారిగానే కాకుండా వేశ్యగానూ కాజల్ ఎలా రక్తి కట్టించిందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kajal Aggarwal, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు