హోమ్ /వార్తలు /సినిమా /

Kajal Aggarwal : కాళికాదేవిలా కత్తి పట్టుకున్న కాజల్ .. ఇండియన్‌2 కోసం కసరత్తు చేస్తున్న వీడియో ఇదే

Kajal Aggarwal : కాళికాదేవిలా కత్తి పట్టుకున్న కాజల్ .. ఇండియన్‌2 కోసం కసరత్తు చేస్తున్న వీడియో ఇదే

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Kajal Aggarwal: టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సినిమాల్లో యాక్ట్ చేసేందుకు రెడీ అయిపోయింది. రీసెంట్‌గానే బిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టన్నింగ్ బ్యూటీ ఇప్పుడు జాతీయ నటుడు కమల్‌హాసన్‌ పక్కన క్రేజీ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్‌-2 సినిమాలో కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది. అందుకోసం ఎలాంటి కసరత్తు చేస్తోందో చూడండి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్(Tollywood)బ్యూటీ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal)సినిమాల్లో యాక్ట్ చేసేందుకు రెడీ అయిపోయింది. రీసెంట్‌గానే బిడ్డకు జన్మనిచ్చిన ఈ స్టన్నింగ్ బ్యూటీ ఇప్పుడు జాతీయ నటుడు కమల్‌హాసన్‌Kamal Haasan పక్కన క్రేజీ డైరెక్టర్ శంకర్‌(Shankar)దర్శకత్వంలో వస్తున్న ఇండియన్‌-2(Indian2) సినిమాలో కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది. షూటింగ్ మొదలైన నాటి నుంచి ఏదో రూపంలో అడ్డంకులతో సినిమా మేకింగ్ ఆగిపోతూ వస్తోంది. అయితే రీసెంట్‌గా ఇండియన్‌-2 చిత్రీకరణలో వేగం పెంచడంతో కాజల్‌ తన వంతు న్యాయం చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కేరళ మార్షల్ ఆర్ట్(Kerala Martial Art)కలరిపయట్టు(Kalari Payattu)ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పుడు ఆ వీడియో(Video)నే సినిమా అభిమానుల్ని, కాజల్‌ ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది.

Pooja Hegde: బాడీలో ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకోన్న పూజా హెగ్డే .. !

కాళికాదేవి అవతారమెత్తిన కాజల్ ..

టాలీవుడ్‌లో చందమామ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తన అప్ కమింగ్ మూవీ ఇండియన్‌-2 సినిమా కోసం భారీ కసరత్తు చేస్తోంది కాజల్. పెళ్లి తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌కి కాస్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు ..ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూనే సినిమాల్లో నటించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే ఇండియన్ 2 సినిమా కోసం కాజల్ అగర్వాల్ కేరళ మార్షల్ ఆర్ట్ 'కలరిపయట్టు'ని ప్రాక్టీస్ చేసింది. ఇండియన్ 2 షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతోంది. నటి ఇప్పుడు ప్రాచీన భారతీయ యుద్ధ కళ అయిన కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటోంది. కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీసుకెళ్లి, కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటున్న వీడియోను షేర్ చేసింది.

కత్తి పట్టి కసరత్తు..

కాజల్ అగర్వాల్‌ తాను కేరళ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ తన ఫీలింగ్‌ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. కలరిపయట్టు ఒక పురాతన భారతీయ యుద్ధ కళ అని దాన్ని యుద్ధభూమి కళలలో సాధనగా పనికొస్తుందని తెలిపింది. షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, టైక్వాండోల పుట్టుక కంటే పురాతనమైన కళామాయాజాలం అంటూ పేర్కొంది. కాలారి పయట్టు సాధారణంగా గెరిల్లా యుద్ధానికి ఉపయోగించబడిందని పేర్కొంది. ఈ సాధన వల్ల శారీరకంగానే కాదు మానసికంగా కూడా శక్తినిచ్చే అద్భుతమైన శిక్షణ అంటూ తెలిపింది.

Mahesh Babu- Rajamouli: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో... ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో..!

సినిమాల్లోకి రీ ఎంట్రీ..

ఇండియన్‌-2 సినిమా కోసం కాజల్ అగర్వాల్ గత మూడేళ్లుగా ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటున్నట్లుగా తెలిపింది. అయితే రెగ్యులర్‌గా నేర్చుకునే తీరిక లేకపోవడంతో ఇప్పుడు కేవలం ఆ పనిలోనే ఉన్నట్లుగా తెలిపింది.ఈ విషయంలో తనకు కలరిపయట్టు విద్యలో శిక్షణ ఇస్తున్న కోచ్‌కు కృతజ్ఞతలు తెలిపింది కాజల్ అగర్వాల్. మొదట్లో స్లిమ్‌గా ...ఆ తర్వాత బేబీ బంప్‌తో ..నిన్నటి వరకు బిడ్డను ఎత్తుకున్న కాజల్ అగర్వాల్ ఒక్కసారిగా మార్షల్ ఆర్ట్ కోసం కసరత్తు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Kajal Aggarwal, Tollywood actress, Viral Video

ఉత్తమ కథలు