సుమ కనకాల.. ఈ పేరు చెప్పగానే తెలియకుండానే మొహంపైకి చిరునవ్వు వచ్చేస్తుంది. అలాంటి ఇమేజ్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. కానీ తెచ్చుకుంది సుమ. పేరుకు మలయాళీ అయినా కూడా మనింటి పిల్లలా.. పక్కింట్లో ఉండేలా ప్రతీ ఇంట్లోనూ కలిసిపోయింది ఈ కేరళ కుట్టి. ప్రస్తుతం తెలుగులో ఈమె కంటే టాప్ యాంకర్ అంటూ ఎవరూ లేరు.. ఇకపై వస్తారనే నమ్మకం కూడా లేదు. ఇదిలా ఉంటే కొన్నాళ్లుగా సుమ వ్యక్తిగత జీవితంపై కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈమె తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి ఉండటం లేదని.. ఇద్దరూ వేర్వేరు ఇళ్లు తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.
దీనిపై అటు సుమ కానీ.. ఇటు రాజీవ్ కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సుమ కనకాల చేసిన ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. చెట్ల మధ్యలో ఆమె పరిగెత్తుతూ వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అంటూ రాసుకొచ్చింది. ఈ చెట్లను చూస్తుంటే కన్నుల సొంపుగా ఉంది. ఆత్మ కూడా చాలా ప్రశాంతంగా ఉంది అంటూ కాస్త కవిత్వాన్ని కూడా చెప్పుకొచ్చింది సుమ కనకాల. సంతోషం అనేది కొంతకాలం ఉండేది కాదు.. అదో నిరంతరం ప్రక్రియ అనే సంగతి గుర్తుంచుకోవాలి.. లోపల బయట ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి అంటూ క్యాప్షన్ ఇచ్చింది సుమ.
ఆనందం అనేది మన చేతుల్లోనే ఉంటుంది.. మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలనేది కూడా మనమే నిర్ణయించుకోవాలంటుంది సుమ. ఈమె చేసిన పోస్ట్ బాగానే వైరల్ అవుతుందిప్పుడు. చెట్లను చూసి అవి కాలాలను బట్టి మారేలా మనం కూడా పరిస్థితులను తగ్గట్లు నడుచుకోవాలంటుంది ఈ టాప్ యాంకర్. లాక్డౌన్ తర్వాత మళ్లీ షోలతో బిజీ అయిపోయింది సుమ కనకాల.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood