Suma Kanakala: సుమ కనకాల బుల్లితెరపై ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎంత సరదాగా ఆట పట్టిస్తుందో కూడా తెలుసు. మరి బయట ఈమె ఎలా ఉంటుంది.. తన స్టాఫ్‌తో ఎలా ఉంటుంది..
సుమ కనకాల బుల్లితెరపై ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎంత సరదాగా ఆట పట్టిస్తుందో కూడా తెలుసు. మరి బయట ఈమె ఎలా ఉంటుంది.. తన స్టాఫ్‌తో ఎలా ఉంటుంది.. ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఈమె బయట కూడా అలాగే ఉంటుంది. అంతే సరదాగా అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన దగ్గర పని చేసే వాళ్లను కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంది సుమ. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు మరోసారి కూడా నిరూపించింది సుమ. తాజాగా తన స్టాఫ్‌తో ఆడుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో సుమ తన వాళ్లతో కలిసి సంభాషిస్తుంది.. సెటైర్లు వేస్తుంది.. అలాగే నవ్విస్తుంది.. తను కూడా నవ్వుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుందిప్పుడు సోషల్ మీడియాలో. ముఖ్యంగా తన మేకప్ రూమ్‌లో అందరితో కలిసి కామెడీ చేస్తుంది సుమ.
తన డ్రైవర్, మేకప్ ఆర్టిస్టుతో పాటు పర్సనల్ స్టాఫ్‌ను కూడా పరిచయం చేసింది. అందులో ఒక్కొక్కరు సుమ దగ్గర కనీసం పదేళ్ల నుంచి పని చేస్తున్నారు. దాన్నిబట్టి ఆమె వాళ్లను ఎలా చూసుకుంటుందో అర్థమైపోతుంది. మేకప్ మెన్‌ను తన ప్రొఫెషన్ గురించి అడుగుతూ.. తను మాస్క్ తీసి సమాధానం చెప్తుంటే మాస్క్ వేస్కో అంటూ సెటైర్ వేసింది సుమ. అలాగే మిగిలిన వాళ్లను కూడా వాళ్ల వాళ్ల అనుభవం గురించి అడుగుతూ వీడియో చేసింది.
యాంకర్ సుమ (Suma kanakala/ Twitter)
ఒకరు 20 ఏళ్లు.. మరొకరు 21 ఏళ్లు అని చెప్తుంటే మీ అందరికంటే నేనే సీనియర్.. 30 ఏళ్లు అంటూ సెటైర్ వేసుకుంది సుమ. గతంలో కూడా తన వాళ్లతో ఇంతే సరదాగా ఉండే వీడియోలు పోస్ట్ చేసింది సుమ కనకాల. ఆ మధ్య లాక్డౌన్ సమయంలో తన ఇంట్లో పనిమనిషితో ఆడుకుంటూ.. వంట చేసుకుంటూ వీడియో పోస్ట్ చేసింది సుమ. అది కూడా అప్పుడు బాగా వైరల్ అయింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న తన ఆడపడుచు దివంతగ నటి, శ్రీలక్ష్మి కనకాల కూతురుతో ఆడుకుంటూ సరదా వీడియో పోస్ట్ చేసింది. ఇలా సుమ పోస్ట్ చేసే ప్రతీ వీడియోలో కూడా ఆమె మంచితనం బయటికి వస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.