• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD ANCHOR SUMA KANAKALA GETS COMPETITION FROM HER OWN HOUSE AND HERE THE DETAILS PK

Anchor Suma Kanakala: యాంకర్ సుమకు ఇంటి పోరు.. కనకాల కుటుంబం నుంచి మరో యాంకర్..

Anchor Suma Kanakala: యాంకర్ సుమకు ఇంటి పోరు.. కనకాల కుటుంబం నుంచి మరో యాంకర్..

యాంకర్ సుమ (Anchor Suma)

Anchor Suma Kanakala: తెలుగు బుల్లితెరని మకుటం లేని మహారాణిగా ఏలేస్తుంది యాంకర్ సుమ కనకాల. తనకు పోటీగా రావాలనే ఆలోచన కూడా మరే యాంకర్‌కు రానీకుండా దూసుకుపోతుంది. ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు దాటినా.. యాంకర్‌గా అగ్రస్థానం చేరి..

  • Share this:
తెలుగు బుల్లితెరని మకుటం లేని మహారాణిగా ఏలేస్తుంది యాంకర్ సుమ కనకాల. తనకు పోటీగా రావాలనే ఆలోచన కూడా మరే యాంకర్‌కు రానీకుండా దూసుకుపోతుంది. ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు దాటినా.. యాంకర్‌గా అగ్రస్థానం చేరి పదేళ్లు దాటిపోయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది యాంకర్స్ తన కళ్ల ముందే వస్తున్నారు వెళ్తున్నారు కానీ సుమ మాత్రం అలాగే ఉండిపోయింది. ప్రతి ఇంట్లోనూ తమ మనిషిలా కలిసిపోయిన సుమను దాటడం అంటే చిన్న విషయం కాదు.. అది కలలో మాటే. అలాంటి రోజు వస్తుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. సుమ తనకు తానుగా రిటైర్ అయితే తప్ప టాప్ యాంకర్ స్థానం మరొకరికి వెళ్లదంటే అతిశయోక్తి కాదేమో..? అలాంటి సుమకు పోటీ వచ్చే ధైర్యం ఏ యాంకర్ చేయదు. అలాంటిది ఇప్పుడు తన ఇంటి నుంచే పోరు మొదలవుతుంది. అవును.. సుమకు ఇంటి పోరు మొదలైంది. కనకాల కుటుంబం నుంచే సుమకు పోటీ వస్తున్నారు. ఎవరబ్బా అనుకుంటున్నారా..? ఇంకెవరు సుమ కనకాల భర్త రాజీవ్. అవును.. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ఇప్పుడు యాంకర్ అవతారం ఎత్తాడు. అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా కూడా ఇప్పటి వరకు కెరీర్ టర్నింగ్ సినిమా ఈయనకు ఒక్కటి కూడా రాలేదు. పాతికేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా స్టార్ కారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం కాలేకపోయాడు. అందుకే బుల్లితెరపై కాన్సట్రేట్ చేస్తున్నాడు రాజీవ్ కనకాల. ఒకప్పుడు సీరియల్స్ చేసిన రాజీవ్.. ఇప్పుడు షోలు చేస్తున్నాడు.
anchor suma,anchor suma twitter,anchor suma facebook,anchor suma husband rajeev kanakala,anchor suma husband rajeev kanakala new program,anchor suma husband rajeev kanakala turns anchor,anchor suma husband rajeev kanakala rechipodam brother show,anchor suma cash show latest promo,telugu cinema,జబర్దస్త్ కమెడియన్స్ రెచ్చిపోదాం బ్రదర్ షో,యాంకర్‌గా మారిన సుమ భర్త రాజీవ్ కనకాల,రెచ్చిపోదాం బ్రదర్ షో ఈటీవీ రాజీవ్ కనకాల
యాంకర్ సుమ రాజీవ్ కనకాల (rajeev kanakala suma)

ఈటీవీలో వచ్చే కొన్ని ఈవెంట్స్‌కు వచ్చాడు రాజీవ్ కనకాల. భార్యతో కలిసి కామెడీ చేసాడు.. అందర్నీ అలరించాడు. అయితే ఇప్పుడు భార్య అండ లేకుండా సోలోగా ఓ షోకు హోస్టుగా మారాడు రాజీవ్ కనకాల. ఈటీవీలో మరో కొత్త కామెడీ ప్రోగ్రామ్ మొదలు కాబోతుంది.

దాని పేరు రెచ్చిపోదాం బ్రదర్. జబర్దస్త్ కమెడియన్స్‌తోనే దీన్ని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. దీనికి రాజీవ్ కనకాలను యాంకర్‌గా తీసుకున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో బాగానే వైరల్ అవుతుంది. ఈ ప్రోమో చూసిన తర్వాత సుమకు ఇంటి పోరు మొదలైంది అంటూ కింద కామెంట్ పెడుతున్నారు అభిమానులు. ఏదేమైనా చూడాలిక.. రాజీవ్ కనకాల యాంకర్‌గా ఎంతవరకు రాణిస్తాడో..?
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు