కొన్ని రోజులుగా కరోనా కేసులు ఇండస్ట్రీలో తగ్గిపోయాయి. అక్కడక్కడా అరకొర కేసులు తప్పిస్తే వచ్చినట్లు కూడా వినిపించడం లేదు. దాంతో తనను మరిచిపోతున్నారేమో అని కరోనాకు కోపం వచ్చినట్లుంది. అందుకే ఏకంగా పెద్ద తలకాయనే టార్గెట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవికి కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉంటే చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత చైన్ చాలా పెద్దగా మారిపోయింది. ఎందుకంటే ఈయన్ని గత నాలుగైదు రోజులుగా కలిసిన వాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే అందులో యాంకర్ సుమ కనకాల కూడా ఉంది. ఇక్కడ నేరుగా చిరుతో ఆమె కాంటాక్ట్ లేకపోయినా కూడా నాగార్జునతో ఉంది. అక్కడ మరో లింక్ ఉంది. రెండు రోజుల కింద నాగార్జున, చిరంజీవి కలిసి వెళ్లి కేసీఆర్‌ను కలిసారు. ఆ తర్వాత నాగార్జున బిగ్ బాస్ షూటింగ్ చేసాడు. అందులో యాంకర్ సుమ వచ్చింది. దాంతో ఇప్పుడు ఆమెకు కూడా కోవిడ్ టెన్షన్ పట్టుకుంది. అయితే ఆ షోకు వెళ్లేముందుగానే కరోనా టెస్ట్ చేయించుకుంది సుమ కనకాల.
And you’ll know what happened after I went to @bb so now see what happened before... pic.twitter.com/iCbcY1p2CQ
— Suma Kanakala (@ItsSumaKanakala) November 9, 2020
ఎందుకంటే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం అక్కడికి ఎవరు గెస్టులుగా వచ్చినా కూడా ముందుగానే కరోనా టెస్ట్ చేయించుకోవాలి. దాంతో టెస్ట్ చేయించుకుని ఇంట్లోకి వెళ్లింది సుమ. దీనికి సంబంధించిన వీడియోను ఇప్పుడు ట్వీట్ చేసింది సుమ. నేను బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు.. కానీ వెళ్లకముందు ఏం జరిగిందో మీరే చూడండి అంటూ పోస్ట్ చేసింది. అందులో కోవిడ్ టెస్ట్ చేయించుకుంటూ కూడా కామెడీ చేసింది సుమ.
రిజల్ట్ ఎంత సేపు పడుతుంది అంటే 10 నిమిషాలు అని అక్కడున్న వాళ్లు చెప్పారు. దాంతో వాళ్లతో కూడా నవ్వులు పూయించింది సుమ. అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సుమకు మళ్లీ కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన ఆవశ్యకత వచ్చేలా కనిపిస్తుంది. మరి చూడాలిక.. ఇప్పుడు సుమ ఏం చేస్తుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood