Home /News /movies /

TOLLYWOOD ANCHOR SRIMUKHI SUPER HOT DANCE WITH TOP CHOREOGRAPHER SEKHAR MASTER AND VIDEO GOING VIRAL PK

Srimukhi - Sekhar Master: పొట్టి గౌనులో శేఖర్ మాస్టర్‌తో శ్రీముఖి చిందులు.. వీడియో వైరల్..

శేఖర్ మాస్టర్‌తో శ్రీముఖి డాన్స్ (srimukhi sekhar master)

శేఖర్ మాస్టర్‌తో శ్రీముఖి డాన్స్ (srimukhi sekhar master)

Srimukhi - Sekhar Master: బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి(Anchor Srimukhi) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. ప్రస్తుతం టాప్ యాంకర్స్‌లో ఒకరిగా కెరీర్‌లో దూసుకుపోతుంది శ్రీముఖి. తాజాగా శేఖర్ మాస్టర్(Sekhar Master) జోడీగా ఈమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. బిగ్ బాస్‌తో పాటు చాలా రియాలిటీ షోలలో ఈమె పాల్గొంది. ప్రస్తుతం టాప్ యాంకర్స్‌లో ఒకరిగా కెరీర్‌లో దూసుకుపోతుంది శ్రీముఖి. దాంతో పాటు సినిమాలు కూడా చేస్తుంది శ్రీముఖి. అన్నింటికి మించి ఈ మధ్య అందాల ఆరబోతలోనూ పిచ్చెక్కిస్తుంది ఈ బొద్దుగుమ్మ. ఇక డాన్సులు బోనస్. ఎప్పటికప్పుడు అదిరిపోయే మాస్ డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిజీగా ఉంటుంది శ్రీముఖి. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తాజాగా ఈమె టాప్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్‌తో చేసిన డాన్సులు వైరల్ అవుతున్నాయి. ఈయన కూడా అంతే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటాడు. అంత టాప్ కొరియోగ్రఫర్ అయినా కూడా బుల్లితెర నటులతోనే ఎక్కువగా క్లోజ్ నెస్ మెయింటేన్ చేస్తుంటాడు శేఖర్ మాస్టర్.

మరోవైపు చిన్నితెర తారలతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా యాంకర్స్‌తో ఈయనకు మంచి అనుబంధమే ఉంది. అందులో శ్రీముఖితో కలిసి ఇప్పుడు ఓ కార్యక్రమం చేస్తున్నాడు శేఖర్ మాస్టర్. దాంతో ఆ షో షూటింగ్ సమయంలోనే ఈమెతో కలిసి మంచి స్టెప్పులు వేసాడు మాస్టర్. పొట్టి గౌన్ వేసుకొని హాట్ హాట్ చిందులు వేసింది శ్రీముఖి.

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. చేసిన వెంటనే వైరల్ అయిపోయింది. తమిళంలో సూపర్ పాపులర్ అయిన వాడ వాడ పయ్యా పాటకు చిందులేసారు శ్రీముఖి, శేఖర్ మాస్టర్. తొడలు చూపిస్తూ శ్రీముఖి వేసిన చిందులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. శేఖర్ మాస్టర్‌తో పోటీ పడి మరీ శ్రీముఖి డ్యాన్స్ ఇరగదీసింది. ఈ పోస్ట్ కింద అదిరిపోయే పాజిటివ్ కామెంట్స్‌తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా కూడా పాట అయితే వైరల్ అవుతుందిప్పుడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor srimukhi, Sekhar Master, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు