వర్మపై కామెంట్స్ చేసిన యాంకర్ శ్యామల (anchor shyamala varma)
Anchor Shyamala: తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న యాంకర్లలో శ్యామల (Anchor Shyamala) కూడా ఒకరు. ఈమెకు సుమ, అనసూయ స్థాయిలో ఫాలోయింగ్ లేదు కానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే సంపాదించుకుంది. అప్పుడప్పుడూ ఈవెంట్స్ చేసుకుంటూ.. మధ్యలో కొన్ని సినిమాలు చేస్తుంది శ్యామల.
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న యాంకర్లలో శ్యామల (Anchor Shyamala) కూడా ఒకరు. ఈమెకు సుమ, అనసూయ స్థాయిలో ఫాలోయింగ్ లేదు కానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే సంపాదించుకుంది. అప్పుడప్పుడూ ఈవెంట్స్ చేసుకుంటూ.. మధ్యలో కొన్ని సినిమాలు చేస్తుంది శ్యామల. దాంతో పాటు రాజకీయాలు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. వైసిపిలో భర్తతో కలిసి జాయిన్ అయింది. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా.. అభిమానులతో కూడా ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూనే ఉంటుంది శ్యామల. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఫ్యాన్స్‌తో ఛిట్ ఛాట్ చేసింది. ఈమెకు యూట్యూబ్‌లో సొంతంగా ఓ ఛానల్ కూడా ఉంది. అది నిర్వహిస్తూనే.. మరోవైపు ఇన్‌స్టాలో ఫాలోవర్లతో మాట్లాడుతుంటుంది. పైగా గ్లామర్ ఫోటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది. తాజాగా మరోసారి ఇన్‌స్టాలో ఫాలోవర్లతో లైవ్ చాట్ చేస్తున్న సమయంలో శ్యామలను విచిత్రమైన ప్రశ్నలు అడిగారు నెటిజన్లు.
వాళ్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు కాదనకుండా సమాధానం చెప్పింది ఈమె. అందులో ఓ నెటిజన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పమని అడిగాడు.. అందుకు శ్యామల తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. వర్మతో శ్యామలకు మంచి అనుబంధమే ఉంది. ఆ మధ్య ఇద్దరూ ఓ వేడుకలో కలిసినపుడు బాగానే ఫ్లర్ట్ చేసాడు వర్మ. దాంతో అప్పట్నుంచి ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన గురించి నెటిజన్ అడిగినపుడు.. నో కామెంట్స్.. కానీ ఆయన గొప్ప దర్శకుడు.. ఒకప్పుడు ఆయన చిత్రాలకు పెద్ద అభిమానిని అంటూ రిప్లై ఇచ్చింది. శ్యామల ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఈ మధ్యే ఓ సినిమా వేడుకలో యాంకర్ శ్యామల గురించి మాట్లాడుతూ.. వర్మ చిత్రమైన కామెంట్స్ చేసాడు. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు అంటూ శ్యామలపై కామెంట్స్ చేశాడు వర్మ. దీంతో శ్యామలతో పాటు.. అక్కడున్న వాళ్లంతా కూడా షాక్ అయ్యారు. వర్మ మరీ ఇంత ఓపెన్ అయిపోయాడేంట్రా బాబూ.. అమ్మాయిలు కనిపిస్తే ఫ్లర్ట్ చేయకుండా ఉండలేడా అంటూ అవాక్కవుతున్నారు. ఇంత మొహమాటం కూడా లేకుండా అలా ఎలా అమ్మాయిల గురించి కామెంట్ చేస్తాడబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అంతలోనే ఇప్పుడు శ్యామల గురించి వర్మపై కామెంట్స్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.