బిగ్ బాస్ హౌస్‌లో... తన సపోర్ట్ ఎవరికో చెప్పేసిన యాంకర్ రవి

ప్రస్తుతం యాంకర్ రవి పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. కానీ.. ప్రేక్షకుల ఓటింగ్‌తో.. ఊహించని.. ట్విస్ట్‌తో.. అలీ రెజా.. శనివారం బిగ్‌బాస్ షోలో.. సేవ్ కాలేదు.

news18-telugu
Updated: October 27, 2019, 3:24 PM IST
బిగ్ బాస్ హౌస్‌లో... తన సపోర్ట్ ఎవరికో చెప్పేసిన యాంకర్ రవి
యాంకర్ రవి ఫైల్ ఫోటో
  • Share this:
యాంకర్ రవి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక యూత్ అయితే యాంకర్ రవి షోలన్నా... సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్టులన్న పడిచ్చిపోతుంటారు. తాజాగా యాంకర్ రవి పెట్టిన ఫేస్ బుక్ పోస్లు ఇప్పుడు వైరల్‌గా మారింది. తెలుగు బిగ్‌బాస్ సీజన్ ఎండింగ్2కు చేరుకుంది. మరో వారంలో విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సమయంలో యాంకర్ బిగ్ బాస్ ఫోలో తన స్వీట్ హార్ట్ ఉన్నాడంటూ అలీరెజా గురించి సంచలన విషయాలు బయటకు చెప్పాడు. అలీ తనకు మంచి మిత్రుడన్నాడు. అలీ కుటుంబం, తన కుటుంబం మధ్య ఎంతో స్నేహబంధం ఉందని చెప్పుకొచ్చాడు రవి. అంతేకాదు.... రంజాన్ వస్తే... అలీ ఇంటి నుంచి నాకు కిలోల కిలోల బిర్యానీ వస్తుందన్నాడు. సంక్రాంతి వస్తే మేమంతా కలిసి అలీ ఇంటిపై గాలిపటాలు ఎగురవేస్తామన్నాడు.

ఓ వీడియోలో.. అలీ గురించి.. అతని ఫ్రెండ్‌షిప్ గురించి చెప్పుకొచ్చాడు. నేను బిగ్‌బాస్‌లో ఉన్న అందరికీ సపోర్ట్ చేస్తున్నానని.. కానీ.. అలీ.. నా ఫ్యామిలీ పర్సన్ అని చెప్పుకొచ్చాడు. అలీ మంచి వ్యక్తిత్వం కలవాడన్నాడు. సింపుల్‌గా చెప్పాలంటే అతను ఓ స్వీట్ హార్ట్ అన్నాడు. మొదట్లో అలీ ఎలిమినేట్ అయ్యేటప్పుడు చాలా బాధపడ్డాడన్నారు. నేను కూడా ఆ సమయంలో షాక్ అయ్యానన్నాడు రవి. ఆ తర్వాత మరోసారి బిగ్ బాస్ తనను హౌస్‌లోకి రావాలని కోరినప్పుడు చాలా రోజుల పాటు ఆలోచించానన్నాడు. మళ్లీ షోలోకి వెళ్లాలా వద్దా ? అన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు యాంకర్ రవి. అలీ హౌస్‌లోకి వెళ్లాలని అతను అడగలేదని తెలిపాడు. శివజ్యోతిని సొంత చెల్లెలిలాగానే అలీ భావించాడు. షోను షోలాగే చూడండి. అలీకి నేను ఓటు చేస్తానన్నాడు రవి. మీకు ఎవరి ఇష్టం అయితే... వారికి ఓటేయండి అన్నాడు. అంతేకాకుండా.. అలీ రెజాను ఫైనలిస్ట్‌గా నాగార్జున గారి పక్కన చూడాలని ఉందని తెలిపాడు రవి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కానీ.. ప్రేక్షకుల ఓటింగ్‌తో.. ఊహించని.. ట్విస్ట్‌తో.. అలీ రెజా.. శనివారం బిగ్‌బాస్ షోలో.. సేవ్ కాలేదు. ఈ వారం ఎలిమినేషన్‌లో వరుణ్ సందేశ్, అలీ, శివజ్యోతి ఎలిమినేషన్‌లో ఉన్నారు. మరి ఆదివారం ఎవరు బయటకు వెళ్తారో కాసేపట్లో తేలిపోనుంది.First published: October 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు