తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాంకర్స్‌లో నెంబర్ వన్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా సుమ కనకాల పేరు వస్తుంది. అయితే ఫీమేల్ యాంకర్స్ కాకుండా మేల్లో అయితే ఎవరు అంటే ప్రదీప్ మాచిరాజు అంటారు. ఈయనతో పాటు చాలా మంది ఉన్నారు కానీ మేల్ యాంకర్స్‌లో అగ్రపీఠం మాత్రం ఈయనదే. దానికి తగ్గట్లుగానే ప్రదీప్ సంపాదన కూడా ఉందని అర్థమవుతుంది. 30 రోజులు బిజీగానే ఉంటాడు ఈ యాంకర్. ఈ మధ్యే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు.. కథలు నచ్చితే హీరోగా నటిస్తూనే ఉంటానని చెప్తున్నాడు కూడా. ఈ సినిమా కోసం 25 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రదీప్ నెల సంపాదన ఎంతనే అనుమానాలు సోషల్ మీడియాలో భారీగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తుంటే మాత్రం 30 లక్షలకు పైగానే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. 2018లోనే ఈయన నెలకు 20 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడని వార్తలొచ్చాయి. ఈ రెండేళ్లలో ప్రదీప్ రేంజ్ మరింత పెరిగింది. ఈయన స్థాయి కూడా భారీగానే ఉందిప్పుడు. అందుకే మరో 30 శాతం ఆదాయం పెరిగిపోయింది.

యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)
అందుకే ఇప్పుడు 40 లక్షల వరకు ప్రదీప్ మాచిరాజు సంపాదిస్తున్నాడని తెలుస్తుంది. ఈయన ఒక్కో ఎపిసోడ్ కోసం 1.25 లక్షలకు పైగానే తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. రెండేళ్ల కింద ఎపిసోడ్‌కు 75 వేల వరకు తీసుకున్న ప్రదీప్ ఇఫ్పుడు తన పారితోషికం మరో 50 వేలు పెంచేసాడు. ఈ ఛానెల్.. ఆ ఛానెల్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఇప్పుడు ప్రదీప్ హవా కనిపిస్తుంది. పైగా ఈయన యాంకరింగ్‌కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)
ప్రస్తుతం ఢీ, జీ సరిగమప లాంటి టాప్ షోలకు యాంకరింగ్ చేస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. మిగిలిన అన్ని ఛానెల్స్‌లో కూడా ప్రదీప్ షోలు చేస్తున్నాడు. 30 రోజులు బిజీగానే ఉండే ఈయనకు ఈ మాత్రం ఆదాయం రావడం కామన్‌గానే కనిపిస్తుంది. పైగా జీ తెలుగులో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అంటూ షోలను నిర్మించాడు కూడా. ఏదేమైనా కూడా యాంకర్‌గా ఉండి ఈ రేంజ్లో సంపాదిస్తున్నాడంటే నిజంగానే గొప్ప విషయమే కదా..?
Published by:Praveen Kumar Vadla
First published:January 23, 2021, 19:42 IST