Anchor Jhansi : నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలు ఉపయోగిస్తూ డైలాగ్స్ చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి జోగి నాయుడిని పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న ఝాన్సీ ప్రస్తుతం తన తల్లిదండ్రులు, కూతురుతో కలిసి జీవిస్తోంది.
యాంకర్ ఝాన్సీ.. (Anchor Jhansi) ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తనదైన మాటలతో బుల్లితెరపై, ఆకట్టుకునే నటనా ప్రతిభతో వెండితెరపై హవా నడిపించింది. నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలు ఉపయోగిస్తూ డైలాగ్స్ చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి జోగి నాయుడిని పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న ఝాన్సీ ప్రస్తుతం తన తల్లిదండ్రులు, కూతురుతో కలిసి జీవిస్తోంది. నటిగా కూడా మారిన ఝాన్సీ వందల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఇక ఝాన్సీ ముక్కుసూటి మనిషి. ఉన్నది ఏదైనా ముఖం ముందే చెప్పేస్తారు. ఝాన్సీ జీవితంలో ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె సంసారం సవ్యంగా సాగలేదు. ఓ పాప పుట్టాక భర్తతో విడాకులు తీసుకున్నారు.
చిన్న వయసులోనే విడాకులైనా కూడా ఝాన్సీ మరో వివాహం చేసుకోలేదు. కన్న కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరిని దత్తత తీసుకొని చదివించి ప్రయోజకులను చేశారు. అలాంటి గుణం ఝాన్సీ సొంతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అలాగే మీడియాను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో తాను చేసిన సెటైరికల్ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏమిటో ఝాన్సీ తెలియజేశారు. ప్రస్తుతం మీడియా అతి ఎక్కువైందని.. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూస్తూ నానా హడావిడి చేస్తున్నారని చెప్పారు. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ‘అనగనగా ఓ ఎద్దు.. దానికొక పుండు.. పుండులో పురుగులు.. ఏంటీ కాకుల గోల? అన్నది మీడియా ఉద్దేశించే అని.. కాకుల్లా మీదపడి పురుగులని ఏరుకుని తినడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతోనే ఆ పోస్ట్ పెట్టానని చెప్పారు. అప్పట్లో ఈ కామెంట్ చిత్ర పరిశ్రమను ఉద్దేశించని కొందరు భావించారు.
కాగా ఝాన్సీ తన ఆహార అలవాట్ల గురించి ప్రేక్షకులకు తెలియజేశారు. రాగి సంగటి, జొన్నన్నం, చద్దన్నం, పచ్చి పులుసు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉదయం.. రాత్రిపూట పండ్ల రసాలతో గడిపేస్తానని చెప్పారు. తన కూతురు గురించి తెలియజేస్తూ... మా అమ్మాయి పేరు ధన్య. ఢిల్లీలో బయోటెక్ రీసెర్చర్ చేస్తుంది. అలాగే వయెలిన్, భరతనాట్యం నేర్చుకుంటుంది. తను నటి కావాలనుకుంటే నేను వద్దని చెప్పను.. అయితే శాస్త్రవేత్త కావాలన్నది ధన్య లక్ష్యం అని ఝాన్సీ చెప్పుకొచ్చారు.
ఇక, లేటెస్ట్ గా ‘స్టార్ మా పరివార్- సీజన్ 3’ అంటూ ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు సీనియర్ యాంకర్ ఝాన్సీ. ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో సీజన్ 1 , సీజన్ 2 ఒక లెక్క.. సీజన్ 3 ఇంకొక లెక్క బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ స్టార్ మాలోని 16 సీరియల్స్ నటీనటులతో సందడి చేస్తోంది ఝాన్సీ. ఫిబ్రవరి 6 (ఆదివారం) నాడు మధ్యాహ్నం 1.30 గంటలకు తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా మంచి స్పందన లభించింది. మొత్తానికి లాంగ్ గ్యాప్ తరువాత ఝాన్సీ ఈజ్ బ్యాక్ అనిపించింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.