ఝాన్సీకి కరోనా అంటూ ప్రచారం.. మండిపడిన యాంకర్..

Anchor Jhansi: ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత కరోనా వైరస్ విళయతాండవం చేస్తుంది. కేవలం 6 రోజుల్లోనే ఇండియాలో లక్ష కేసులు దాటిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 4, 2020, 6:59 PM IST
ఝాన్సీకి కరోనా అంటూ ప్రచారం.. మండిపడిన యాంకర్..
యాంకర్ ఝాన్సీ ఫైల్ ఫోటో (anchor jhansi)
  • Share this:
ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత కరోనా వైరస్ విళయతాండవం చేస్తుంది. కేవలం 6 రోజుల్లోనే ఇండియాలో లక్ష కేసులు దాటిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇండియాలో 6 లక్షలు దాటిపోయాయి కేసులు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా నిర్మాత పోకూరి రామారావు కూడా చనిపోయాడు. దాంతో పాటు సీరియల్ యాక్టర్స్ కూడా వరసగా కరోనా బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీనియర్ యాంకర్ ఝాన్సీకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
యాంకర్ ఝాన్సీ ఫైల్ ఫోటో (anchor jhansi)
యాంకర్ ఝాన్సీ ఫైల్ ఫోటో (anchor jhansi)


ఇప్పటికే షూటింగ్స్ మొదలు కావడంతో ఇది నిజమే అని అంతా అనుకున్నారు కూడా. అయితే వెంటనే ఝాన్సీ కూడా ఈ విషయంపై స్పందించింది. ఇప్పటికే బుల్లితెర నటులు ప్రభాకర్, హరికృష్ణ, నవ్యస్వామితో పాటు ఆమెతో ఆమె కథ సీరియల్‌లో నటిస్తున్న బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణకు కూడా తాజాగా కరోనా వచ్చింది. ఈ క్రమంలోనే యాంకర్ ఝాన్సీకి కూడా కరోనా సోకిందంటూ వార్తలు వచ్చాయి.
యాంకర్ ఝాన్సీ ఫైల్ ఫోటో (anchor jhansi)
యాంకర్ ఝాన్సీ ఫైల్ ఫోటో (anchor jhansi)

ఈమె నిర్వరహించిన ఓ కార్యక్రమంలో కొందరికి కరోనా రాగా.. వాళ్ళ నుంచి ఝాన్సీకి కూడా వచ్చిందనే వార్తలు వచ్చాయి. దాంతో వెంటనే ఈమె స్పందించి రూమర్స్‌పై మండి పడింది. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూనే తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. దయచేసి లేనిపోని సృష్టించొద్దని కోరింది. అంతేకాదు.. గాసిప్స్ గురించి మాట్లాడేందుకు మాత్రం తనకు ఎవరూ ఫోన్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది ఝాన్సీ.
Published by: Praveen Kumar Vadla
First published: July 4, 2020, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading