Home /News /movies /

TOLLYWOOD ANCHOR HUSBAND COMMITS SUICIDE AT HYDERABAD SB

టాలీవుడ్ యాంకర్ భర్త ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వీరి వివాహం జరిగి కూడా పదేళ్లు కావొచ్చింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

    టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. టీవీ యాక్టర్, యాంకర్ రేఖ భర్త ఆత్మహత్య చేసుకున్నారు. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న రేఖ.... యాంకరింగ్ కూడా చేస్తున్నారు. ఆమె గోపినాధ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం జరిగి కూడా పదేళ్లు కావొచ్చింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం రేఖ ఒక ప్రైవేట్‌ టీవీ ఛానల్‌లో పని చేస్తోంది. అయితే ఆమె భర్త గోపినాత్...జేజే నగర్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే అక్కడ పనిచేస్తున్న మరో యువతితో గోపినాథ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయమై వీరిద్దరికి తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో గురువారం కూడా రేఖ, గోపినాథ్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఇంటి నుంచి ఆఫీసు‌కు వెళ్లిపోయిన గోపినాథ్ అక్కడే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

    యాంకర్ రేఖ భర్త ఆత్మహత్య
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Illegal affairs, Suicide, Tollywood, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు