Anasuya Bharadwaj: అమ్మ అవ్వడం గురించి అద్భుతంగా చెప్పిన అనసూయ.. వైరల్!

anasuya bharadwaj

Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందాలతో అభిమానులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై కూడా భారీస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

  • Share this:
    Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందాలతో అభిమానులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై కూడా భారీస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా అనసూయ.. తన వయసు తో పాటు అందాన్ని కూడా పెంచుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. ఇదిలా ఉంటె అమ్మ అవ్వడం గురించి తన మాటలతో సింపుల్ గా చెప్పేసింది.

    ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా యాంకరింగ్ గా పరిచయం అయిన అనసూయ.. ఆ తర్వాత బుల్లితెరలో మాత్రం రంగమ్మత్త గా బాగా ఆకట్టుకుంది. ఇక వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని.. స్పెషల్ సాంగ్ లలో కూడా తన స్టెప్పులతో అభిమానుల మనసులను దోచుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెండితెర లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనసూయ.. తాజాగా విడుదలైన థాంక్యూ బ్రదర్ సినిమాల్లో బాగా ఆకట్టుకుంది.



    థాంక్యూ బ్రదర్ సినిమా లో గర్భవతి పాత్రలో నటించిన అనసూయ ప్రేక్షకులను మెప్పించింది. ఈ విధంగా ఈ సినిమా విడుదల సందర్భంగా.. సినీ బృందం ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో అమ్మ అవ్వడం గురించి ఒక్క మాటలో చెప్పేసింది. ప్రసవ సమయంలో వచ్చే నొప్పులు గురించి, ఆడపిల్లగా పుట్టడం, అమ్మ అవ్వడం గురించి, ఇక తనకు గర్భవతి పాత్రలో నటించడం అంత కష్టంగా అనిపించలేదు అని కొన్న విషయాలు పంచుకుంది. అంతే కాకుండా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకోగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులలో కూడా అనసూయ బాగా బిజీగా ఉంది.
    Published by:Navya Reddy
    First published: