Thimmarusu Movie Trailer: ‘తిమ్మరుసు’ ట్రైలర్ రివ్యూ.. ఈ లాయర్ కొడితే లైఫ్ అంతా రీ సౌండ్ వస్తదంట..!

సత్యదేవ్ తిమ్మరుసు (Satyadev Thimmarusu)

Thimmarusu trailer: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన నటులలో సత్యదేవ్ (Satyadev) కూడా ఒకడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో ఇప్పుడు ప్రామిసింగ్ హీరోగా ఎదిగాడు. తాజాగా ఈయన నటించిన తిమ్మరుసు ట్రైలర్ విడుదలైంది.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన నటులలో సత్యదేవ్ కూడా ఒకడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో ఇప్పుడు ప్రామిసింగ్ హీరోగా ఎదిగాడు. ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ వచ్చిన సత్యదేవ్.. వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు కారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే.. మరోవైపు హీరోగానూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న తిమ్మరుసు సినిమా ట్రైలర్ విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ విడుదల చేయడం విశేషం. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు తిమ్మరుసు సినిమాను నిర్మిస్తున్నాడు. ఈయన జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. అందుకే తిమ్మరుసు ట్రైలర్ ఎన్టీఆర్ విడుదల చేసాడు. కిరాక్ పార్టీ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు. టీజర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన తిమ్మరుసు ట్రైలర్‌తోనూ అదే చేసింది.

8 ఏళ్ళ కింద జరిగిన ఓ మర్డర్ మిస్టరీని ఈ చిత్రంలో చూపించారు. కేసు రీ ఓపెన్ చేసి అందులో దోషులకు శిక్ష వేయించాలని సత్యదేవ్ ఆ కేసు టేకప్ చేస్తాడు. ఆ క్రమంలోనే ఆయనకు ఎదురైన ఇబ్బందులే సినిమా కథ. సినిమాలో సీనియర్ నటీనటులు చాలా మందే ఉన్నారు. బ్రహ్మాజీ ఫుల్ లెంత్ రోల్ చేసాడు. అలాగే రవిబాబు కూడా ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జువాల్కర్ హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో కచ్చితంగా సినిమా కూడా అలరిస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ప్యాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమైన తొలి సినిమా ఇదే. జులై 30న తిమ్మరుసు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ రానుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: