Charmme Kaur: హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మి తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్..

Charmme Kaur: తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా వచ్చి ఇప్పుడు నిర్మాతగా సెటిల్ అయిపోయింది ఛార్మి కౌర్. ఎక్కడో పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగమ్మాయిలా కలిసిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 25, 2020, 11:03 PM IST
Charmme Kaur: హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మి తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్..
ఛార్మి కౌర్ (Charmi kaur)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా వచ్చి ఇప్పుడు నిర్మాతగా సెటిల్ అయిపోయింది ఛార్మి కౌర్. ఎక్కడో పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగమ్మాయిలా కలిసిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా నిర్మిస్తుంది ఛార్మి. ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్‌తో కలిసి నిర్మిస్తుంది ఈమె. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను కూడా నిర్మించారు. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే బ్యాంకాక్‌లో మొదలు కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఛార్మి తల్లిదండ్రులిద్దరూ కరోనా బారిన పడ్డారు. ఇదే విషయం తన సోషల్ మీడియా పేజీలో అభిమానులతో షేర్ చేసుకుంది ఛార్మి.

ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా తన పేరెంట్స్ కోవిడ్ బారిన పడ్డారని చెప్పుకొచ్చింది ఛార్మి. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయాయని చెప్పింది ఛార్మి. అందుకే తన పేరెంట్స్ కోవిడ్ పాజిటివ్ అయ్యారని చెప్పుకొచ్చింది ఛార్మి. AIG హాస్పిటల్స్‌లో ప్రస్తుతం ఛార్మి తల్లిదండ్రులు చికిత్స తీసుకుంటున్నారు. వాళ్లు ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పింది ఛార్మి.
Published by: Praveen Kumar Vadla
First published: October 25, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading