Actress Tabu: అల్లుడితో సరసపు గిల్లుడు.. 50 ఏళ్లలో ఇవేం పనులు టబు..?

హీరోయిన్ టబు (Actress Tabu)

Actress Tabu: కూలీ నెంబర్ 1 సినిమాతో వెంకటేష్‌ (Venkatesh)కు జోడీగా తెలుగు తెరకు పరిచయం అయింది టబు (Tabu). అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగార్జున (Nagarjuna), చిరంజీవి (Chiranjeevi), బాలయ్య (Balakrishna) లాంటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది టబు. ఇప్పుడు బాలీవుడ్‌లో మరో సంచలన పాత్రకు సిద్ధమైంది ఈమె.

  • Share this:
సీనియర్ హీరోయిన్ టబు గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇక్కడ ఆమె చేసింది తక్కువే సినిమాలే అయినా కూడా స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో నటించింది టబు. ఇప్పటికీ ఈమెకు మంచి డిమాండ్ ఉంది. వయసు 50 కి చేరువైనా కూడా టబు కోసం దర్శకులు కథలు రాస్తూనే ఉన్నారు. సాధారణంగా ఈ వయసులో ఆంటీ పాత్రలు చేస్తుంటారు మాజీ భామలు. కానీ టబు మాత్రం పెళ్లి కాకపోవడంతో ఇప్పటికీ హీరోయిన్ పాత్రలే చేస్తుంది. పైగా ఈమె కోసం అలాంటి పాత్రలు డిజైన్ చేస్తున్నారు దర్శకులు. సౌత్‌లో ఈమెను అత్తగా మార్చేసారు కానీ ఇప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం హీరోయిన్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. పైగా సంచలన పాత్రలతో ఈ మధ్య ట్రెండింగ్ అయిపోతుంది టబు. సెన్సేషనల్ రోల్స్ చేస్తూ.. కాంట్రవర్సీలకు తెరతీస్తుంది ఈమె. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న టబు.. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రతో రాబోతుంది. ఏకంగా అల్లుడితోనే గిల్లుడు ప్రోగ్రామ్ పెట్టేసే పాత్రలో కనిపించబోతుంది ఈమె. ప్రస్తుతం భూల్ భులయ్య 2 సినిమాలో నటిస్తుంది టబు. ఇందులో కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. కార్తిక్‌కు కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపేసారు.

మరోవైపు కియారా కూడా హోమ్ క్వారంటైన్‌లోనే ఉంది. ఈ ఇద్దరూ కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారు. పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కియారా తల్లిగా నటిస్తుంది టబు. అంటే హీరోకు అత్త అన్నమాట. కానీ కథ ప్రకారం అల్లుడ కార్తిక్ ఆర్యన్‌తోనే టబు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించబోతుందని వార్తలొస్తున్నాయి. ఇలాంటి పాత్రలు చేయడం టబుకు కొత్త కాదు. ఈ మధ్య కాంట్రవర్సీ కారెక్టర్స్ బాగానే చేస్తుంది టబు.
tabu,tabu twitter,tabu instagram,tabu hot photos,tabu karthik aaryan hot scenes,tabu ishan khattar hot scenes,tabu bhool bhulaiyaa 2,టబు,టబు హాట్ సీన్స్,టబు భూల్ భులయ్యా 2
హీరోయిన్ టబు (Actress Tabu)

ముఖ్యంగా కుర్ర హీరోలతోనే రొమాన్స్ పండిస్తుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన అంధాధూన్‌లో టబు చేసిన పాత్ర మరిచిపోలేం. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్నాడు. ఇందులో టబు చేసిన బోల్డ్ పాత్రలో తమన్నా నటిస్తుంది. మరోవైపు ఏ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్‌లో తనకంటే వయసులో 25 ఏళ్లు చిన్నవాడైన ఇషాన్ ఖట్టర్‌తో బెడ్రూమ్ సీన్స్ చేసింది టబు.

కథ నచ్చితే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది టబు. ఇప్పుడు కూడా ఇదే చేయబోతుంది. మరి అల్లుడితో గిల్లుడు ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: