• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD ACTRESS SUREKHA VANI ONCE AGAIN REACTED SERIOUSLY OVER GOSSIPS ABOUT HER SECOND MARRIAGE PK

Surekha Vani Second marriage: రెండో పెళ్లిపై మరోసారి ఘాటుగా స్పందించిన సురేఖ వాణి..

Surekha Vani Second marriage: రెండో పెళ్లిపై మరోసారి ఘాటుగా స్పందించిన సురేఖ వాణి..

సురేఖ వాణి (surekha vani Instagram)

Surekha Vani Second marriage: తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య రెండో పెళ్లి గోల ఎక్కువైపోయింది. చాలా మంది సెలబ్రిటీస్ మరో పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు, సునీత లాంటి వాళ్లు పరిస్థితులకు అనుగుణంగా రెండో పెళ్లి చేసుకున్నారు.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య రెండో పెళ్లి గోల ఎక్కువైపోయింది. చాలా మంది సెలబ్రిటీస్ మరో పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు, సునీత లాంటి వాళ్లు పరిస్థితులకు అనుగుణంగా రెండో పెళ్లి చేసుకున్నారు. దాంతో మరికొందరు కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. అందులో నటి సురేఖ వాణితో పాటు హీరో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. వీళ్లు కూడా మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనోజ్ ఫన్నీగా స్పందించాడు. డేట్ టైమ్ కూడా మీరే చెప్పేయండి అంటూ ట్వీట్ చేసాడు. మరోవైపు సురేఖ వాణి సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఇప్పటికే ఈమె కూతురు సుప్రిత తన తల్లిపై వచ్చిన వార్తలను ఖండించింది. మీడియాను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. యిష్టమొచ్చినట్లు రాయడం జర్నలిజం అనిపించుకోదంటూ విమర్శించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సురేఖ వాణి కూడా సీరియస్ కామెంట్స్ చేసింది. ఈమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి తన కూతురు సుప్రితతో కలిసి ఒంటరిగానే ఉంటుంది సురేఖ. కానీ సునీత పెళ్లి తర్వాత ఈమె కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని.. ఇప్పటికే వరుడు కూడా సిద్ధంగా ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటికే ఒకసారి క్లారిటీ ఇచ్చింది సురేఖ. అయినా కూడా ఈ తప్పుడు ప్రచారం ఆగకపోవడంతో సీరియస్ అయింది ఈమె. సురేఖ రెండో పెళ్లిపై ఓ మీమ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సురేఖ వాణి రెండో పెళ్లి అంట.. అయితే.. ముందు వరసలో నేనుంటా అంటూ బ్రహ్మానందాన్ని వాడుకుంటూ మీమ్ చేసారు.
Surekha Vani,Surekha Vani second marriage,Surekha Vani serious about second marriage,Surekha Vani daughter,Surekha Vani twitter,Surekha Vani instagram,Surekha Vani hot photos,Surekha Vani daughter supritha naidu,Surekha Vani daughter supritha hot photos,Surekha Vani daughter supritha instagram,Surekha Vani daughter supritha twitter,Surekha Vani daughter supritha hot videos,Surekha Vani second marriage,సురేఖ వాణి,సురేఖ వాణి కూతురు సుప్రిత,సురేఖ వాణి సుప్రిత మీడియాపై సీరియస్,సురేఖ వాణి రెండో పెళ్లి
సురేఖ వాణి రెండో పెళ్లిపై మీమ్ (Surekha Vani)

ఈ మీమ్ షేర్ చేసిన సురేఖ వాణి.. ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పుకొచ్చింది. అనుమతి లేకుండా ఎవరి జీవితాల్లోకి ప్రవేశించొద్దని సీరియస్2గా వార్నింగ్ ఇచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా యిష్టమొచ్చినట్లు రాయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తుంది సురేఖ వాణి. ఉన్నవి రాయండి.. లేనివి క్రియేట్ చేసి రాయకండి.. మీరు జర్నలిస్టులు అనుకోకండి అంటూ ఫైర్ అయ్యింది. ఇప్పుడు సురేఖ వాణి కూడా ఇదే స్టైల్‌లో రియాక్ట్ అయింది. ఏదేమైనా ఈ వ్యాఖ్యలతో సురేఖ అండ్ ఫ్యామిలీ బాగా హర్ట్ అయిందనే విషయం మాత్రం అర్థమైపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు