Home /News /movies /

TOLLYWOOD ACTRESS SUREKHA VANI CHECK ON RUMOURS COMMENTING AGE NR

Surekha Vani: ప్రేమకు వయసుతో పనేంటి.. ఇన్‌డైరెక్ట్‌గా రెండో పెళ్ళికి హింట్ ఇచ్చిన సురేఖ వాణి?

surekha vani

surekha vani

Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీ ఆర్టిస్ట్ సురేఖ వాణి పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో భార్య, వదిన, అక్క, తల్లి పాత్రలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీ ఆర్టిస్ట్ సురేఖ వాణి పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో భార్య, వదిన, అక్క, తల్లి పాత్రలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా కూడా చేసింది సురేఖ వాణి. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.

    ఇక ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా వల్ల బాగా ఫాలోయింగ్ పెంచుకుంది సురేఖ వాణి. తన భర్త మరణించిన తర్వాత బాగా సోషల్ మీడియాకు అలవాటు పడింది. అంతేకాకుండా తనకు సంబంధించిన డాన్స్ వీడియోలను, ఫోటోలు బాగా షేర్ చేసుకుంటుంది. ఇక తనకు తన ఎత్తు కూతురు ఉండగా తనతో పాటు పోటీగా తయారవుతుంది సురేఖవాణి. ఇక సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటుంది.

    తన భర్త చనిపోయిన తర్వాత తను రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ విషయం గురించి వెంటనే స్పందించి పుకార్లను తోసిపుచ్చింది. ఇదంతా ఇలా ఉంటే ఈమధ్య గ్లామర్ తో మరింత రెచ్చిపోతుందని చెప్పవచ్చు. ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. అంతే కాకుండా ఓ ఫోటో కూడా షేర్ చేసుకోగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.



    ప్రేమకు వయసు తో పని లేదు అంటూ ఆమె వయస్సు అనేది ప్రేమలో ఒక నెంబర్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. పైగా ఈ విషయం గురించి ఉద్దేశిస్తూ తమ కంటే తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న నలుగురు జంటలను ఫోటోలను షేర్ చేసింది. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిక్ జోనస్ లో కూడా ఉండగా.. మరో హాలీవుడ్ జంటలు కూడా ఉన్నారు.ఇక ఈమె ఈ ఫోటోలు షేర్ చేయగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక తాను కూడా తనకంటే చిన్న వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందేనని పలురకాల కామెంట్ ఎదురవుతున్నాయి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Actress Surekha Vani, Second marriage, Singer Sunitha, Tollywood

    తదుపరి వార్తలు