news18-telugu
Updated: November 17, 2019, 9:02 AM IST
స్నేహా ఉల్లాల్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? (credit - insta - snehaullal)
Sneha Ullal : అందచందాలు, అమాయకపు క్యూట్ ఫేస్ ఉండి కూడా ఆఫర్లు రాని అమ్మాయి ఎవరైనా ఉందా అంటే... స్నేహా ఉల్లాల్ పేరు చెప్పుకోవచ్చు. 2005లో లక్కీ-నో టైమ్ ఫర్ లవ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ... మూడేళ్ల తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీలో 15కి పైగా సినిమాలు చేసింది. 2010లో బాలయ్య సరసన సింహా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా అది స్నేహఉల్లాల్ కెరీర్‌కి పెద్దగా ప్లస్ అవ్వలేదని అనుకోవచ్చు. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ పోలికలతో ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశమే అయినా... పెద్దగా పరిచయాలు పెంచుకోకుండా ఉండటంతో... అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ పెద్దలు స్నేహా ఉల్లాల్‌ను మర్చిపోయారు.
నాలుగేళ్లుగా సిల్వర్ స్క్రీన్‌కి దూరమైన స్నేహా ఉల్లాల్... సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. చేతిలో సినిమాలు లేక ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్న ఈ బ్యూటీ... తాజాగా మాత్రం ఓ వీడియోని షేర్ చేసింది. తన క్యూట్ తాబేలు చిప్‌కి స్నానం చేయిస్తూ... వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది ఈ మస్కట్ భామ.
ఈ వీడియోని ఫ్యాన్స్ ఎగబడి కలబడి చూడకపోయినా... మామూలుగా బాగానే చూస్తున్నారు. శనివారం పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 22వేల మందికి పైగా చూశారు.
Pics : ఫ్యాషన్‌కి కొత్త అర్థం చెబుతున్న రెహనా బషీర్
ఇవి కూడా చదవండి :
Pics : రోజూ వాడే వస్తువులే కేకులు... న్యూజెర్సీ బేకర్ ప్రతిభ
Weight Loss : శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండటం ఎలా?
Viral Video : వీరాభిమానిని కాపాడిన విరాట్ కోహ్లీ...
Viral Video : ఊర్వశీ? స్వప్నా?... ఎవరు బాగా డాన్స్ చేశారు?
రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... ఇవీ ప్రయోజనాలు...
ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం
Published by:
Krishna Kumar N
First published:
November 17, 2019, 9:02 AM IST