Home /News /movies /

TOLLYWOOD ACTRESS SHRIYA SARAN WISHING JANMASHTAMI WITH CLASSICAL DANCE VIDEO HAS GONE VIRAL SNR

Shriya Saran : క్లాసికల్‌ డ్యాన్స్‌తో జన్మాష్టమి శుభాకాంక్షలు .. శ్రియ డ్యాన్స్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

(Photo Credit:Instagram)

(Photo Credit:Instagram)

Shriya Saran: ఇష్టం అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా పరిచయమైన సౌత్ యాక్టరస్‌ శ్రియ శరణ్‌లో మరో టాలెంట్‌ దాగి ఉందని ఇప్పుడే అందరికి తెలిసింది. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన నృత్యాన్ని చేసింది ఒకప్పటి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌. ఇప్పుడు ఆ డ్యాన్స్ వీడియోనే వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India
ఇష్టం అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్‌గా పరిచయమైన సౌత్ యాక్టరస్‌ శ్రియ శరణ్‌(Shriya Saran)లో మరో టాలెంట్‌ దాగి ఉందని ఇప్పుడే అందరికి తెలిసింది. జన్మాష్టమి(janmashtmi) సందర్భంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన నృత్యాన్ని చేసింది ఒకప్పటి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌(Tollywood star heroine)శ్రియ. ప్రాంతాలు మారినప్పటికి , పరభాష సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికి , విదేశీయుడ్ని(Foreigner)వివాహం చేసుకున్న తర్వాత కూడా శ్రియ భారతీయ సాంప్రదాయం, సంస్కృతిని ఎంతగానో గౌరవిస్తోందని శ్రియ చేసిన క్లాసికల్‌ డ్యాన్స్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

Krishnashtami 2022: జన్మాష్టమి రోజు కచ్చితంగా వెళ్లాల్సిన ప్రదేశం ఇదే.. శ్రీ రాధా పార్థసారథి విశిష్టత ఏంటంటే?



క్లాసికల్ డ్యాన్స్ చేసిన టాలీవుడ్ నటి ..
ప్రేక్షకులు, తన అభిమానులతో పాటు సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రియ క్లాసికల్ డ్యాన్స్‌ను అద్భుతంగా చేసిన వీడియోని తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఇప్పటి వరకు నటనతో ...తన ఫ్యామిలీ వీడియోలతో అందరితో షేర్ చేసుకుంటున్న శ్రియ ఈ డ్యాన్స్‌ వీడియోతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. శ్రియ కథాకళి డ్యాన్సర్ అని, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియోలను తన ఫాలోవర్స్‌తో షేర్ చేయడం ఆమెకు చాలా ఇష్టం.




వీడియో గిఫ్ట్ ..
కృష్ణజన్మాష్టమి సందర్భంగా శ్రియ ఒక భక్తి పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకుంది. డాన్స్‌లో కృష్ణుడిని చూస్తానని చెప్పింది శ్రియ. ఈ రోజు ప్రేమ, ఆనందాన్ని పంచుదాం అంటూ చిన్న కామెంట్‌ని షేర్ చేసింది శ్రియ. నేను కృష్ణుడిని నృత్యంలో చూస్తున్నాను, అది దైవానికి కనెక్ట్ అయ్యే నా మార్గం. మరీ మీ మార్గం ఏమిటో చెప్పమంటూ ప్రశ్నను నెటిజన్లకు వేసింది. లంగా, ఓణీలో జడ వేసుకొని శ్రీకృష్ణుడ్ని సంతోష పెట్టడానికి శ్రియ ఏకంగా గోపిక వేషంలో వచ్చినట్లుగా ఉంది.

TTD: వైభవంగా వెంకటేశ్వర స్వామి తిరుప్పాడ సేవ.. నేత్ర దర్శనంతో భక్తుల పరవశం.. విశిష్టత ఏంటంటే..?


వాటే టాలెంట్‌ శ్రియ..
శ్రియ డ్యాన్స్‌ వీడియోకి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. గార్జియస్, బ్యూటిఫుల్ డ్యాన్స్ అంటూ నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సినిమాలో డ్యూయెట్స్‌కి అదిరిపోయే స్టెప్పులు వేసే శ్రియలో ఇంత గొప్ప క్లాసికల్ డ్యాన్సర్‌ దాగి ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Shriya Saran, Sri Krishna Janmashtami, Tollywood actress, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు