Home /News /movies /

TOLLYWOOD ACTRESS SHRADDHA DAS ARTHAM MOVIE SPECIAL POSTER RELEASED AND GETS POSITIVE RESPONSE PK

Shraddha Das Artham movie: ఆకట్టుకుంటున్న శ్రద్ద దాస్ ‘అర్థం’ సినిమా బర్త్ డే స్పెషల్ పోస్టర్..

శ్రద్ధా దాస్ అర్థం సినిమా పోస్టర్ (shraddha das artham)

శ్రద్ధా దాస్ అర్థం సినిమా పోస్టర్ (shraddha das artham)

Shraddha Das Artham movie: ఆర్య 2 సహా తెలుగులో చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das). ఈమె హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ కారెక్టర్స్‌తో కూడా బాగానే గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం అర్థం పోస్టర్ విడుదలైంది.

ఇంకా చదవండి ...
అల్లు అర్జున్ (Allu Arjun) ఆర్య 2, ప్రభాస్ (Prabhas) డార్లింగ్ సహా తెలుగులో చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das Artham movie). ఈమె హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ కారెక్టర్స్‌తో కూడా బాగానే గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రధాన పాత్రలో మల్టిలాంగ్వేజ్ మూవీ 'అర్థం' (Artham movie) రూపొందుతోంది. మణికాంత్ తాళ్లగూటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో  మాస్టర్ మహేంద్రన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మార్చి 4న శ్రద్ద దాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో శ్రద్ద దాస్ లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. ఇందులో చేతిలో పుస్తకం పట్టుకొని తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది శ్రద్ద దాస్. ఈ చిత్రంలో మాయ అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) రోల్‌లో నటిస్తోంది శ్రద్ద. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ శ్రద్ద క్యారెక్టర్ డిఫైన్ చేస్తూ సినిమాలో ఆమె రోల్ చాలా పవర్‌ఫుల్ అని తెలిపేలా ఉంది.

మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధిక శ్రీనివాస్ నిర్మించిన 'అర్థం' సినిమాను తమిళం, తెలుగు భాషల్లో తెరెక్కిస్తున్నారు. అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ మ్యూజికల్ టీజర్‌ సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా మ్యూజికల్ రైట్స్‌ని టిప్స్ ఫిల్మ్స్ & మ్యూజిక్ చేజిక్కించుకుంది.

Movie Titles: ‘అరుణాచలం’ నుంచి ‘అన్నవరం’ వరకు.. ఊరి పేర్లే టైటిల్స్‌గా వచ్చిన 20 సినిమాలు ఇవే..


ఈ సినిమా ఈ చిత్రం మాయ అనే సైకియాట్రిస్ట్‌ చుట్టూ తిరిగే కథతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుందని డైరెక్టర్ మణికాంత్ తాళ్లగూటి అన్నారు. అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న తన పేషెంట్లలో ఒకరైన వైతరణ్ హత్య చేశాడని నమ్మిన 'మాయ' అతనితో ఎలా ప్రవర్తిస్తుంది? ఆ హత్య మిస్టరీని ఎలా ఛేదించింది అనే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. ఈ సినిమాకు తెలుగులో అర్ధం, కన్నడలో అర్థ, అనే టైటిల్స్ ఫిక్స్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. చిత్రంలో అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, అమని, సాహితి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Shraddha Das, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు