హోమ్ /వార్తలు /సినిమా /

క్లాసికల్ డాన్స్‌తో కట్టిపడేస్తున్న పూర్ణ

క్లాసికల్ డాన్స్‌తో కట్టిపడేస్తున్న పూర్ణ

పూర్ణ (credit - insta - shamnakasim)

పూర్ణ (credit - insta - shamnakasim)

Shamna Kasim | Poorna : అద్భుతంగా డాన్స్ చేసే పూర్ణ (షామ్నా కాసిమ్)... తన నటనతోపాటూ... క్లాసికల్ డాన్స్ ద్వారా కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది.

Shamna Kasim | Poorna : పూర్ణ... అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి పరిచయమైన మలయాళీ బ్యూటీ. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' వంటి సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఆ మధ్య వచ్చిన 'జ‌య‌మ్ము నిశ్చయ‌మ్మురా' మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైనా... తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు ఈ భామకు. దాంతో మలయాళ ఇండస్ట్రీకి వెళ్లి... అక్కడ సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకు మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడం కలిపి దాదాపు 40 సినిమాల్లో నటించింది పూర్ణ. అయినప్పటికీ... పూర్తిస్థాయి స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఎక్స్‌పోజింగ్, స్కిన్ షో కంటే... నటనకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటుంటారు ఆమె అభిమానులు. అయినప్పటికీ... ఆఫర్ల కోసం స్కిన్ షోల జోలికి మాత్రం వెళ్లకుండా... పూర్ణ ది గ్రేట్ అనిపించుకుంటోంది ఈ బ్యూటీ.

View this post on Instagram

When u dance your purpose is not to get a certain place on the floor... Its to Enjoy each STEP along the Way😍


A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) onకేరళకు చెందిన పూర్ణ (షమ్నా ఖాసీం) ముస్లిం కుటుంబంలో జన్మించింది. సినిమాల్లోకి వచ్చాక తన అసలు పేరు షమ్నా ఖాసీంతో కాకుండా పూర్ణ పేరుతో రాణిస్తోంది. ఐతే... సినిమా ఇండస్ట్రీకి రాకముందే... పూర్ణా క్లాసికల్ డాన్సర్. ఏ స్టెప్పైనా ఆమె అద్భుతంగా వేస్తుందంటారు ఆమె ఫ్యాన్స్. సినిమాలతోపాటూ... డాన్స్ ద్వారా కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది పూర్ణ. కొన్ని స్టెప్స్ ఆమె వేసినట్లు మరెవ్వరూ వెయ్యలేరని అభిమానులు చెబుతుంటారంటే... డాన్స్‌పై ఆమెకు ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు.

View this post on Instagram


A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) onడాన్స్‌లో వేసే ప్రతీ స్టెప్పునూ ప్రేమించాలని చెప్పే పూర్ణా... ఓవైపు తన కెరీర్‌ను డెవలప్ చేసుకుంటూనే... మరోవైపు అప్పుడప్పుడూ క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌లు చేస్తూ... ఆ కళలకు కూడా ప్రాణం పోస్తోంది. ఇప్పుడు ఎంతో మంది లేడీ అభిమానులు తాము కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటామనీ... తమకు నేర్పమని పూర్ణను కోరుతుండటం విశేషం.

View this post on Instagram

Small bit from my favorite dance ..... my sweety my best Choreograher @sunitharao_vr 😍😘😍


A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) onFirst published:

Tags: Shamna Kasim, Tollywood Movie News, Tollywood news

ఉత్తమ కథలు