Tollywood actress: చస్తే బికినీ వేయను.. 2 కోట్లు ఇవ్వాల్సిందే.. స్టార్ హీరోయిన్ డిమాండ్..

టాలీవుడ్ హీరోయిన్ (Tollywood actress)

Tollywood actress: హీరోలతో సమానంగా ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు.. ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు కూడా.

  • Share this:
హీరోలతో సమానంగా ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు.. ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు కూడా. తెలుగు ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరోయిన్లకు భారీ క్రేజ్ ఉంది. పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి వాళ్లైతే సినిమాకు ఏకంగా 2 నుంచి 4 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. కియారా తాజాగా శంకర్ సినిమాలో రామ్ చరణ్‌తో నటించడానికి 3.8 కోట్లు పారితోషికం తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పూజా కూడా బాగానే అందుకుంటుంది. వీళ్లు ఎంత తీసుకుంటే అందాల ఆరబోత కూడా అంతే ఉంటుంది. బికినీకి కూడా వెనకాడరు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం దర్శకులకు చుక్కలు చూపిస్తుంది. తనకు సినిమాకు 2 కోట్లు కావాలి కానీ బికినీ మాత్రం వేయనని మొండికేస్తుందని తెలుస్తుంది.

సోషల్ మీడియాలో బికినీతో దర్శనమిస్తే కొందరు మాత్రమే చూస్తారు.. అదే సినిమాలలో బికినీ వేస్తే కుటుంబంతో పాటు వచ్చే ఆడియన్స్‌కు చూడటానికి చాలా చెండాలంగా ఉంటుందని ఆమె చెప్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే తాను బికినీ వేసుకునేది లేదని.. ఏం చేస్తారో చేసుకోండి.. మీ యిష్టం అంటూ దర్శకులకు చిన్న సైజ్ వార్నింగులు కూడా ఇస్తుందని తెలుస్తుంది.
tollywood actress,tollywood actress remuneration,tollywood actress hot photos,tollywood actress hot videos,tollywood actress remuneration details,tollywood actress bikini show,టాలీవుడ్ హీరోయిన్,టాలీవుడ్ హీరోయిన్ రెమ్యునరేషన్,టాలీవుడ్ హీరోయిన్ పారితోషికం 2 కోట్లు,టాలీవుడ్ హీరోయిన్ బికినీ
టాలీవుడ్ హీరోయిన్ (Tollywood actress)

ఈ క్రమంలోనే సదరు హీరోయిన్ బికినీ వేసుకోనని ఖచ్చితంగా చెప్పడమే కాకుండా తన రెమ్యూనరేషన్ విషయంలోనూ తగ్గేదే లే అనేసిందని వార్తలొస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరోయిన్‌కు ఉన్న క్రేజ్, మార్కెట్ దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు కూడా ఏమనలేకపోతున్నారు. ఈ రోజుల్లో అవకాశం వస్తే చాలు ఎంత గ్లామర్ అయినా ఒలకబోస్తామని చెప్పే హీరోయిన్లున్నారు. అలాంటిది వచ్చిన అవకాశాన్ని కూడా వదిలేసుకోడానికి రెడీగా ఉంది ఈ హీరోయిన్.
Published by:Praveen Kumar Vadla
First published: