Home /News /movies /

TOLLYWOOD ACTRESS SANGHAVI REVEALS ABOUT COMEDIAN ALI BROTHER KAYYUM LOVE STORY NR

Actress Sanghavi - kayyum: రక్తంతో ప్రేమలేఖలు రాసిన అలీ తమ్ముడు.. అసలు గుట్టు బయటపెట్టిన నటి సంఘవి!

Actress Sanghavi - kayyum

Actress Sanghavi - kayyum

Actress Sanghavi - kayyum: ఒకప్పటి తెలుగు సినీ నటి సంఘవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఎన్నో సినిమాలలో నటించిన ఈమె తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని స్టార్ హోదా ను సంపాదించుకుంది. ఇక ఈమె లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో అడుగు పెట్టగా ఆ తర్వాత ఆహా సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇంకా చదవండి ...
    Actress Sanghavi - kayyum: ఒకప్పటి తెలుగు సినీ నటి సంఘవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఎన్నో సినిమాలలో నటించిన ఈమె తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని స్టార్ హోదా ను సంపాదించుకుంది. ఇక ఈమె లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో అడుగు పెట్టగా ఆ తర్వాత ఆహా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత దాదాపు 95 కు పైగా సినిమాలలో నటించింది సంఘవి. ఇదిలా ఉంటే ఓ స్టార్ కమెడియన్ తమ్ముడి గురించి అసలు గుట్టు బయట పెట్టింది.

    తెలుగులోనే కాకుండా కన్నడ భాషలో కూడా నటించింది. ఇక ఈమె శివయ్య సినిమాలో నటించగా ఆ సినీ దర్శకుడు సురేష్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వగా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇదిలా ఉంటే ఈమె గతంలో ఓ రియాలిటీ షోలో పాల్గొంది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

    ఇది కూడా చదవండి:మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విద్యుల్లేఖ రామన్‌.. చిల్ అవుతున్న లేడీ కమెడియన్!

    అసలు పేరు కావ్య రమేష్ అని.. తను కర్ణాటకలోని మైసూర్ లో జన్మించానని తెలిపింది. తను చదువుకుంటున్న సమయంలో తనకు మోడలింగ్ పై ఆసక్తి ఉండటంతో అప్పుడే మోడలింగ్ లో అడుగుపెట్టాను అని తెలిపింది. ఇక ఈమె బాలనటిగా పలు సినిమాలలో నటించానని.. ఆ సమయంలో తనకు హీరోయిన్ గా నటించాలని ఆసక్తి ఉండటంతో హీరోయిన్ గా అడుగు పెట్టాను అని తెలిపింది. ఈమె బుల్లితెరపై కూడా పలు సీరియల్ లో నటించాను అంటూ కొన్ని కొన్ని షోలలో కూడా పాల్గొనేదాన్ని అని తెలిపింది.

    ఇది కూడా చూడండి: ట్రెడిషనల్ లుక్‌లో బేబీ కృతిక.. త్వరలోనే సీరియల్ హీరోయిన్ కార్తీకదీపం సౌర్య

    ఈమెకు ఓ స్టార్ కమెడియన్ తమ్ముడు ప్రేమ లేఖలు రాశాడని తెలుపగా.. ఆ స్టార్ కమెడియన్ ఎవరో కాదు అలీనే. అలీ తమ్ముడు ఖయ్యూమ్, తను ఒకే కాలేజీ లో చదువుకున్నామని.. ఇక ఖయ్యూమ్ తనకు జూనియర్ అని తెలిపింది. ఇక తన తమ్ముడు గురించి నేరుగా ఆలీతోనే చెబుతూ.. కాలేజ్ రోజుల్లో మీ తమ్ముడు నాకు ఎన్నో ప్రేమ లేఖలు రాశాడు అంటూ.. అంతే కాకుండా కొన్ని కొన్ని సార్లు తన రక్తంతో కూడా ప్రేమ లేఖలు రాశాడు అని చెప్పే సరికి ఆలీ తెగ షాక్ అయ్యాడు. అలా ప్రతిరోజు ప్రేమ లేఖలు పంపించే వాడని కానీ నేను అసలు పట్టించుకునే దానిని కాదని తెలిపింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Actress sanghavi, Comedian ali, Kayyum, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు