Samantha about Marriage: పెళ్లిపై సంచలన పోస్ట్ పెట్టిన సమంత.. మీ కూతుళ్లకు ముందు అది నేర్పించండి..

Samantha Photo : Instagrarm

Samantha about Marriage: నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వద్దన్నా కూడా వార్తల్లోనే ఉంటుంది. మొన్నటికి మొన్న తన పరువు పోయేలా.. ప్రైవసీకి భంగం వాటిల్లేలా వార్తలు రాసారంటూ రెండు యూ ట్యూబ్ ఛానెల్స్‌పై కేసు పెట్టింది సమంత (Samantha about Marriage).

  • Share this:
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వద్దన్నా కూడా వార్తల్లోనే ఉంటుంది. మొన్నటికి మొన్న తన పరువు పోయేలా.. ప్రైవసీకి భంగం వాటిల్లేలా వార్తలు రాసారంటూ రెండు యూ ట్యూబ్ ఛానెల్స్‌పై కేసు పెట్టింది సమంత. ఇందులో ఆమెకు అనుకూలంగానే కోర్టు తీర్పు కూడా వచ్చింది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు.. మరోవైపు సోషల్ మీడియాతో ఎప్పుడూ హెడ్ లైన్స్‌లోనే ఉంటూ వస్తుంది స్యామ్. దాంతో పాటు ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే స్టోరీస్ కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టింది సమంత. ఇది చూసి అభిమానులతో పాటు అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటుంది సమంత. ఇలాంటి సమయంలో పెళ్లి గురించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది స్యామ్. పెళ్లి గురించి, అమ్మాయిల గురించి పోస్ట్ చేయడం చర్చకు దారితీసింది.

ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్లకు ఎలా పెళ్లి చేయాలనే విషయంపైనే తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే దానిపై కాకుండా వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించాలని.. పెళ్లి కంటే ముఖ్యమైన విషయాలు మరికొన్ని కూడా ఉన్నాయని చెప్తూ పోస్ట్ చేసింది స్యామ్. ‘మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే దాని మీద కంగారు అవసరం లేదు. ఆమె పెళ్లికి డబ్బులు దాచుకునే కంటే.. వాటిని ఆమె చదువు కోసం ఉపయోగించండి. ఆమె కాళ్లపై ఆమె నిలబడేలా ప్రోత్సహించండి.. దానిపై ఆమెకు ఆత్మవిశ్వాసం నింపండి. మొదట ఆమెను ఆమె ప్రేమించుకోవడం, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లడం.. ఎలాంటి పరిస్థితిలో అయినా నిలబడటం నేర్చుకోనివ్వండి.. జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఒంటరిగా నిలబడి పోరాడే ధైర్యాన్నివ్వండి.. పెళ్లి కంటే ఇవే ముఖ్యమైన అంశాలు’ అంటూ పోస్ట్ చేసింది.

Vakeel Saab - Sreekaram - Love Story: 2021లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్రేక్ ఈవెన్ సాధించని 11 సినిమాలు ఇవే..


విడాకుల తర్వాత సమంత చేసిన కొన్ని పోస్టులను నెటిజన్లు కూడా లైట్ తీసుకున్నారు. అయితే అమ్మాయిల విషయంలో ఈమె పెట్టిన ఈ పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది. దీనికి చాలా మంది సపోర్ట్ చేయడమే కాకుండా.. అందులో నిజం లేకపోలేదు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. బయట సమాజం ప్రస్తుతం అలాగే ఉంది.. అమ్మాయిల పెళ్లి కంటే ముందు జీవితం అంటే ఏంటో నేర్పిస్తూ పెంచాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఎంతైనా ఉందంటున్నారు విశ్లేషకులు కూడా.
Published by:Praveen Kumar Vadla
First published: