Home /News /movies /

TOLLYWOOD ACTRESS SAMANTHA AKKINENI SHARED A CUTE FUN DANCING VIDEO FROM THE SETS OF THE FAMILY MAN 2 PK

Samantha Akkineni: షూటింగ్ మధ్యలో సమంత అక్కినేని చిలిపి పని.. కారావాన్ వీడియో వైరల్..

సమంత (Samantha in Family man Photo : Instagram)

సమంత (Samantha in Family man Photo : Instagram)

Samantha Akkineni: సమంత అక్కినేని (Samantha Akkineni) మొన్నటి వరకు కేవలం సినిమాలు మాత్రమే చేసింది కానీ ఇప్పుడు వెబ్ సిరీస్‌లకు కూడా హాట్ ఫేవరేట్ అయిపోయింది. ఒకే ఒక్క వెబ్ సిరీస్ ఈమె కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. హిందీలో ఈమెకు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
సమంత అక్కినేని మొన్నటి వరకు కేవలం సినిమాలు మాత్రమే చేసింది కానీ ఇప్పుడు వెబ్ సిరీస్‌లకు కూడా హాట్ ఫేవరేట్ అయిపోయింది. ఒకే ఒక్క వెబ్ సిరీస్ ఈమె కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. మొన్నటి వరకు సినిమాలు చేయాలా వద్దా అని ఆలోచించే సమంత అక్కినేని.. ఇప్పుడు సినిమాలు వద్దులే వెబ్ సిరీస్ ముద్దులే అంటుంది. హిందీలో ఈమెకు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ పాత్ర ఈమెకు అంతగా పేరు తీసుకొచ్చింది. ఒక్క వెబ్ సిరీస్‌తో ఇంత క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మరొకరు ఈ మధ్య కాలంలో లేరంటే అతిశయోక్తి కాదేమో..? ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌లో రాజీ పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది. కనీసం ఒక్క చోట కూడా సమంత నవ్వదంటే ఆశ్చర్యపోక తప్పదు. అంత సీరియస్‌గా ఉండే పాత్ర ఇది. అనుక్షణం అవమానాలు.. అణిచివేతకు గురైన అమ్మాయి పాత్ర ఇది. అందులోంచి ఆవేశం పుట్టి.. తుపాకి చేత పట్టిన తీవ్రవాది పాత్ర.

ముందు ఎల్‌టిటిఈ పాత్రలో నటించినందుకు తమిళనాట బాగానే విమర్శలు వచ్చినా కూడా సమంత నటించిన తీరు చూసి అంతా ముగ్ధులైపోయారు. ఆ తర్వాత సమంత నటనతో ప్రేమలో పడిపోయారు. అయితే అంత సీరియస్ కారెక్టర్ చేస్తున్నపుడు సాధారణంగా.. బయట కూడా అంతే సీరియస్‌గా ఉంటారు. ఎందుకంటే ఫన్ మోడ్‌లోకి వస్తే మూడ్ పోతుందని అలాగే కంటిన్యూ చేస్తుంటారు. కానీ స్యామ్ మాత్రం డిఫెరెంట్.

అంత సీరియస్ రోల్ చేసినా కూడా బయట మాత్రం చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వీడియోనే విడుదల చేసింది సమంత. షూటింగ్ మధ్యలో సమంత సెట్స్‌లో ఎలా ఉండేదో ఒక వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పాట పాడుతూ, డాన్స్ చేస్తూ ఉన్న వీడియో వైరల్ అవుతుంది. అంత చిలిపిగా ఉండే సమంత.. ఇంత సీరియస్ రోల్ చేసిందా అని ఆశ్చర్యపోతున్నారంతా.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akkineni samantha, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు