TOLLYWOOD ACTRESS SAMANTHA AKKINENI RAISED THE DOUBTS ABOUT HER DIVORCE GOSSIPS WITH NAGA CHAITANYA AND MISSED NAGARJUNA BIRTHDAY PARTY PK
Samantha Akkineni: అనుమానాలు ఇంకా పెంచేసిన సమంత అక్కినేని.. దానికి అర్థమేంటి..?
సమంత అక్కినేని (Samantha Akkineni)
Samantha Akkineni: అసలే సమంత అక్కినేని (Samantha Akkineni), నాగ చైతన్య (Naga Chaitanya)పై కొన్ని రోజులుగా టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కూడా లేనిపోని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమంత చేసిన ఓ పనితో అనుమానాలు ఇంకా పెరిగిపోయాయి. దాంతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుందిప్పుడు.
అసలే సమంత అక్కినేని, నాగ చైతన్యపై కొన్ని రోజులుగా టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కూడా లేనిపోని వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అనేది దీని సారాంశం. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు రావడంతో విడిపోవడానికి నిర్ణయించుకున్నారంటూ కొన్ని మీడియా సంస్థలలో వార్తలు బలంగానే వచ్చాయి. నేషనల్ మీడియా అయితే ఏకంగా చైతూ, సమంత పేర్లతో సహా విడాకుల వ్యవహారం గురించి రాసుకొచ్చింది. మన దగ్గర మాత్రం పేర్లు బయటపెట్టకుండా గాసిప్స్ మాదిరే రాసారు. అయితే ఇలాంటి సమయంలో సమంత చేసిన ఓ పని చూసి అభిమానులతో పాటు అంతా షాక్ అయ్యారు. నిజానికి అలా వార్తలు వస్తున్నపుడే.. నాగార్జునకు బర్త్ డే విషెస్ చాలా ప్రేమగా చెప్పింది సమంత. మామా.. నువ్వే నాకు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ అంటూ ప్రేమగా చెప్తూ ప్రేమగా ఎమోజీలు కూడా పోస్ట్ చేసింది. దాంతో అక్కినేని జంట బాగానే ఉన్నారులే.. ఎలాంటి గ్యాప్ రాలేదులే అంటూ అభిమానులు సర్దుకున్నారు. అయితే అంతలోనే నాగార్జున బర్త్ డే పార్టీలో మాత్రం మిస్ అయింది సమంత. కుటుంబం అంతా కలిసి చేసుకున్న ఈ పార్టీలో అక్కినేని కోడలు మాత్రమే మిస్సింగ్.
చైతూ మాత్రం ఆ ఫోటోలలో నవ్వుతూ కనిపించాడు. మొహంలో ఎలాంటి కంగారు కానీ.. టెన్షన్ కానీ లేదంటున్నారు ఫ్యాన్స్. విడిపోతున్నారనే వార్తలు వస్తున్నా కూడా ఇంత సంతోషంగా ఉన్నారంటే.. అందులో ఎలాంటి నిజం లేదనే విషయం మీకు అర్థం కావడం లేదా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అక్కడున్న పార్టీలో నాగ చైతన్య, నాగార్జున, అఖిల్, అమలతో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించారు. మరి అంతా బాగానే ఉంది.. సమంత ఎందుకు రాలేదు.. మామకు అంత ప్రేమగా విషెస్ చెప్పిన కోడలు.. పార్టీకి ఎందుకు రాలేదబ్బా అంటూ అంతా ఆరా తీస్తున్నారు. ఇక్కడే సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.
కావాలనే సమంత రాలేదు.. విడిపోతున్నారు కాబట్టే నాగార్జున బర్త్ డేను లైట్ తీసుకుందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు.. సమంత రాకపోవడానికి కారణం తమిళంలో విజయ్ సేతుపతి, విఘ్నేష్ శివన్, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తుండటమే అంటూ మరోవైపు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అక్కడ టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టే నాగార్జున బర్త్ డేకు రాలేదు తప్ప మరే ఇతర కారణాలు లేవంటున్నారు అభిమానులు. మరి ఇందులో నిజమేదో.. గాసిప్ ఏదో తెలియక అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. దీనిపై చైస్యామ్ ఒక్కటిగా వచ్చి క్లారిటీ ఇచ్చేవరకు వార్తలు ఆగేలా లేవు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.