Ram Charan - Sai Pallavi: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన కల్చర్ ఏంటంటే.. ఒకరి సినిమాలు ఒకరు చూడటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా దాని గురించి అద్భుతంగా ప్రశంసించడం. ఒకరు ఇద్దరు హీరోలు కాదు టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఇదే చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన కల్చర్ ఏంటంటే.. ఒకరి సినిమాలు ఒకరు చూడటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా దాని గురించి అద్భుతంగా ప్రశంసించడం. ఒకరు ఇద్దరు హీరోలు కాదు టాలీవుడ్లో చాలా మంది హీరోలు ఇదే చేస్తున్నారు. చిరంజీవి (Chiranjeevi), మహేష్ బాబు (Mahesh Babu), రామ్ చరణ్ (Ram Charan) లాంటి హీరోలు అయితే విడుదలైన ప్రతీ సినిమాను చూడటమే కాదు.. సోషల్ మీడియాలో రివ్యూలు కూడా ఇస్తుంటారు. మొన్నటికి మొన్న పుష్ప సినిమా చూసి ఫిదా అయిపోయాడు. అల్లు అర్జున్ నటనను ఓ రేంజ్లో పొగిడేసాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇదే చేసాడు. అయితే ఈయన ట్వీట్ చేసిన సినిమా పుష్ప కాదు.. శ్యామ్ సింగరాయ్. నాని హీరోగా నటించిన ఈ సినిమాను రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కించాడు. డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. విజయం కూడా అందుకుంది.
ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను చూడటమే కాకుండా సోషల్ మీడియాలో రివ్యూ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కోసం చూస్తున్న రామ్ చరణ్.. తనకు దొరికిన గ్యాప్లో శ్యామ్ సింగరాయ్ సినిమాను చూసాడు. మొన్న తన అక్క సుష్మిక కొణిదెల నిర్మించిన సేనాపతి సినిమా చూసి తన స్పందనను తెలియజేసిన రామ్ చరణ్.. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ విషయంలోనూ ఇదే చేసాడు.
హీరో నాని, హీరోయిన్స్ సాయి పల్లవి, కృతి శెట్టిలకి కంగ్రాట్స్ చెప్పాడు. అంతేకాదు.. నాని, సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ ప్రశంసల వర్షం కురిపించాడు చరణ్. దాంతో నాని, సాయి పల్లవి ఇద్దరూ స్పందించారు. థ్యాంక్ యూ చరణ్ అంటూ నాని రిప్లై ఇస్తే.. సాయి పల్లవి ఇప్పుడు మరింత ఎగ్జైట్ అయిపోయింది.
Thank you so much Sir☺️ I’m so happy that you took the time off to watch n let us know that you liked the film🙈 n I can’t wait to watch RRR ☺️ https://t.co/B9dwdeT2Rx
మా కోసం మీరు టైం తీసుకొని సినిమా చూడడం.. చూసిన తర్వాత మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు.. అలాగే ట్రిపుల్ ఆర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సాయి పల్లవి తెలిపింది. గతంలో తెలుగులో తనకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పాడు చరణ్. ఫిదా సినిమా తర్వాత తను సాయి పల్లవికి ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చాడు చరణ్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.