TOLLYWOOD ACTRESS SAI PALLAVI OPENS ABOUT HER MARRIAGE AND SAYS HER HUSBAND QUALITIES PK
Sai Pallavi: పెళ్లిపై కుండ బద్ధలు కొట్టేసిన సాయి పల్లవి.. అతడే నా వాడంటూ క్లారిటీ..
సాయి పల్లవి (Sai Pallavi/instagram)
Sai Pallavi: పాతికేళ్లు వచ్చాయంటే ఇంట్లో మొదలయ్యే తొలిప్రశ్న పెళ్లెప్పుడు అని..? ఇలాంటిది ఇప్పుడు కొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి చేసుకోమంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ మధ్యే హన్సిక అలాంటి ప్రకటన చేసింది. ఆ తర్వాత సాయి పల్లవి..
పాతికేళ్లు వచ్చాయంటే ఇంట్లో మొదలయ్యే తొలిప్రశ్న పెళ్లెప్పుడు అని..? ఇలాంటిది ఇప్పుడు కొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి చేసుకోమంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ మధ్యే హన్సిక అలాంటి ప్రకటన చేసింది. ఆ తర్వాత సాయి పల్లవి కూడా ఇదే చెప్తుంది. దాంతో అందర్లోనూ ఆసక్తి మొదలైంది. అసలు సాయి పల్లవి ఏంటి.. పెళ్లికి దూరంగా ఉండటం ఏంటి..? ఎందుకు ఉన్నట్లుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి గల కారణమేంటి అని ఆమె అభిమానులు కూడా మదనపడుతున్నారు. ఆమె మాత్రం కేవలం అమ్మా నాన్నలను చూసుకోడానికి పెళ్లికి దూరంగా ఉంటానంటూ చెబుతుంది. అసలు ఇది కారణంగా కనిపించడం లేదు. ఫిదా సినిమాలో కూడా ఇలాంటి పాత్రలోనే నటించింది ఈ ముద్దుగుమ్మ.. తండ్రిని వదిలేసి వెళ్లడం ఇష్టం లేక ఇష్టం లేని పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యే పాత్ర ఇది. అయితే నిజ జీవితంలో మాత్రం అలా కాకుండా కన్యగానే ఉండిపోతానని చెబుతుంది. దానికి కారణం కూడా ఏమీ లేదు.. పేరెంట్స్ కోసం పెళ్లి అనే మాట త్యాగం చేయాలని ఫిక్సైపోయింది ఈ భాన్సువాడ భానుమతి. నిజంగా సినిమాలో వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటానంటుంది సాయి పల్లవి.
సాయి పల్లవి (sai pallavi)
అంటే తన కోసం అమ్మా నాన్నలతో కలిసిపోయి ఉండే అబ్బాయి కావాలంటుంది సాయి పల్లవి. అయితే కాలేజీలో ఉన్నపుడు సాయి పల్లవి ప్రేమలో ఉండేదనే వార్తలున్నాయి. అప్పట్లో ఈ విషయంపై సాయి పల్లవి కూడా ఓపెన్ అయింది. ఆ తర్వాత మాత్రం ప్రేమ గీమా జాన్తా నై అంటూ ఎంబిబిఎస్ చదువుతో బిజీ అయిపోయింది. డాన్సులు, సినిమాలు బోనస్.
లవ్ స్టోరీ పోస్టర్ Photo : Twitter
ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నపుడు పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది సాయి పల్లవి. ప్రేమ విఫలం కారణంగానే పెళ్లికి దూరం అనే నిర్ణయం తీసుకుందా లేదంటే నిజంగానే ఆమెకు పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదా అనేది తెలియక తికమకపడుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈమె విరాట పర్వం సినిమాతో పాటు లవ్ స్టోరీలో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు 2021లోనే విడుదల కానున్నాయి. తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేస్తుంది సాయి పల్లవి.