Roja Ramani: అతనితో కలిసి భోజనం చెయ్యడం అదృష్టం.. రోజారమణి!

Roja Ramani

Roja Ramani: ఒకప్పటి తెలుగు సినీ నటి రోజారమణి. ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.ఇక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు సంపాదించుకుంది.

  • Share this:
    Roja Ramani: ఒకప్పటి తెలుగు సినీ నటి రోజారమణి. ఈమె పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.ఇక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు సంపాదించుకుంది. బాలనటిగా 1967 లో భక్త ప్రహ్లాద సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకోవడమే కాకుండా ఉత్తమ బాలనటి అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం సినిమాలలో కూడా నటించింది.

    దాదాపు 17 సినిమాలలో నటించిన ఈమె.. అసెంబ్లీ రౌడీ సినిమాలో చివరిసారిగా నటించింది. ఇక ఈమె ఒడియా నటుడు చక్రపాణి ని వివాహం చేసుకోగా.. వీరి ముద్దుల కొడుకే మన టాలీవుడ్ స్టార్ యంగ్ హీరో తరుణ్. ఇక వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఇక ఈమె తన భర్త చక్రపాణి తో ఓ రియాల్టీ షోలో పాల్గొని తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

    ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎంతో మంది సెలబ్రెటీలను ఆహ్వానించి తమ చేతనే తమ వ్యక్తిగత విషయాలను బయటపడేలా చేస్తాడు అలీ. ఇక వచ్చే ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో రోజారమణి దంపతులు ఈ షోలో పాల్గొన్నారు. ఇక అలీ వాళ్లను అక్క బావ అంటూ షో కి స్వాగతించాడు. అందులో కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకుంది. తాను ఎక్కువగా సినీ ఫీల్డ్ లో ఉండటంవల్ల చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదని తెలిపింది రోజారమణి.

    ఇక తనకు ఉపాధ్యాయులతో కూడా అంత పరిచయం లేదని తెలిపింది. అలాంటిది తనకు ఓ అదృష్టం వచ్చిందట. భారతదేశమంతటా పూజించే, గర్వించే రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ను తను నేరుగా కలిసిందట. అంతేకాకుండా ఆయనతోపాటు కూర్చొని కలిసి భోజనం కూడా చేయడం తన అదృష్టమని తెలిపింది రోజారమణి.
    Published by:Navya Reddy
    First published: