TOLLYWOOD ACTRESS REGINA CASSANDRA SHOCKING MAKEOVER GOES VIRAL IN SOCIAL MEDIA PK
రెజీనాకు ఏమైంది.. ఇంత విచిత్రంగా మారిపోయిందేంటి..?
హీరోయిన్ రెజీనా న్యూ లుక్ (regina cassandra/twitter)
Regina Cassandra: గుర్తు పట్టారా ఇక్కడున్న హీరోయిన్ను. ఆ.. మీరు ఊహించింది కరెక్టే. అక్కడున్నది రెజీనానే. అవును నిజంగా రెజీనానే. అయ్యో ఈమెకేమైంది ఇలా అయిపోయింది..
గుర్తు పట్టారా ఇక్కడున్న హీరోయిన్ను. ఆ.. మీరు ఊహించింది కరెక్టే. అక్కడున్నది రెజీనానే. అవును నిజంగా రెజీనానే. అయ్యో ఈమెకేమైంది ఇలా అయిపోయింది అనుకుంటున్నారా..? ఏమో మరి లాక్డౌన్ బోర్ కొట్టిందేమో కానీ రెజీనా మాత్రం ఇలా మారిపోయింది. ఈ భామ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో చాలా సినిమాలే చేసింది. కానీ ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ మాత్రం కాలేదు. రవితేజ లాంటి సీనియర్ హీరోలతో పాటు సాయి ధరమ్ తేజ్, నాగ శౌర్య లాంటి కుర్ర హీరోలతో నటించినా కూడా రెజీనా జాతకం మారలేదు.
హీరోయిన్ రెజీనా న్యూ లుక్ (regina cassandra/twitter)
రెచ్చిపోయి అందాలు ఆరబోసినా కూడా ఈమెను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఇలాంటి సమయంలో చిరంజీవి ఆచార్యలో ఐటం సాంగ్ చేసే ఆఫర్ అందుకుంది రెజీనా. ఈ మధ్యే చిరంజీవితో కలిసి స్టెప్పులు కూడా వేసింది ఈమె. ఈ వయసులో కూడా మెగా స్టెప్పులు చూసి తనకు మైండ్ బ్లాక్ అయిపోయిందని చెబుతుంది రెజీనా.
హీరోయిన్ రెజీనా న్యూ లుక్ (regina cassandra/twitter)
ఇదిలా ఉంటే తాజాగా బయటికి వచ్చిన రెజీనా ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈమె మేకోవర్ చూసి వామ్మో అనుకుంటున్నారు. ఏమైంది ఇలా అయిపోయింది.. సినిమాలు లేకపోయేసరికి పూర్తిగా మేకోవర్ అయిపోయిందా ఏంటి అనుకుంటున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం రెజీనా కొత్త లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.