Rashmika Mandanna: రష్మిక మందన్న బీచ్ వర్కవుట్స్.. వైరల్ అవుతున్న వీడియో..

Rashmika Mandanna Workouts: తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో వచ్చిన ఈ బ్యూటీ గీత గోవిందంతో స్టార్ అయిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 30, 2020, 3:12 PM IST
Rashmika Mandanna: రష్మిక మందన్న బీచ్ వర్కవుట్స్.. వైరల్ అవుతున్న వీడియో..
రష్మిక మందన్న వర్కవుట్ వీడియో (rashmika mandanna/YouTube)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో వచ్చిన ఈ బ్యూటీ గీతగోవిందంతో స్టార్ అయిపోయింది. ఆ వెంటనే దేవదాస్, డియర్ కామ్రేడ్ లాంటి ఫ్లాపులు వచ్చినా కూడా సరిలేరు నీకెవ్వరుతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. భీష్మతో మరో సక్సెస్ కూడా అందుకుని ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో ప్రస్తుతం నెంబర్ వన్ పీఠం కోసం పూజా హెగ్డేతో పోటీ పడుతుంది రష్మిక మందన్న. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది రష్మిక. ఎప్పుడూ జిమ్‌లోనే కాలం గడిపేస్తూ ఉంటుంది. దాంతో పాటు బయట కూడా వర్కవుట్స్ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే బీచ్‌లో కూడా వర్కవుట్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంది రష్మిక.

అది కాస్తా వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలోని బీచ్‌లను అందంగా తన ఫిజిక్ కోసం వాడుకుంటుంది రష్మిక మందన్న. తాజాగా తన ట్రైనర్ స్నేహా సమక్షంలో సముద్రం ఒడ్డున వర్కవుట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈమె వర్కవుట్స్‌కు ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్. బీచ్‌లో వర్కవుట్ చేయడం అనేది ఇప్పటి వరకు పెద్దగా చూడలేదు. కానీ రష్మిక మందన్న మాత్రం అలాగే చేస్తుంది. అలల శబ్ధం వస్తుంటే.. సాయంత్రం పూట సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో వర్కవుట్స్ చేయడం అందమైన అనుభవం అంటుంది రష్మిక. ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 30, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading