• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TOLLYWOOD ACTRESS RASHMIKA MANDANNA FAN SEARCHING HER HOUSE IN GOOGLE OVER 900 KILOMETERS NR

Rashmika Mandanna: రష్మిక ఇంటిని గూగుల్‌లో వెతుక్కుంటూ 900 కి.మీ ప్రయాణం.. చివరికి?

Rashmika mandanna

Rashmika Mandanna: ఇండస్ట్రీలో నటీనటులకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక తమ సినిమాలు వస్తున్నాయంటే చాలు ఎదురు చూడకుండా ఉండరు.

  • Share this:
    Rashmika Mandanna: ఇండస్ట్రీలో నటీనటులకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక తమ సినిమాలు వస్తున్నాయంటే చాలు ఎదురు చూడకుండా ఉండరు. వాళ్ల గురించి తెలుసుకోవాలని కూడా తెగ ఆరాటపడుతుంటారు అభిమానులు. పొరపాటున తమ అభిమాన హీరో హీరోయిన్స్ కనిపించారంటే అంతే సంగతి. ఒకప్పుడు వాళ్ల ఆటోగ్రాఫ్ కోసం ఎగబడితే ఇప్పుడు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు.

    ఇక మరి కొంతమంది క్రేజీ అభిమానులు ఏకంగా ఫోన్ నెంబర్లను, ఇంటి అడ్రస్ లను కూడా వెతుకుతుంటారు. ఇలా చాలా మంది హీరో హీరోయిన్స్ తమ అభిమానుల పోరు తట్టుకోలేక బయటకి రావడానికి కూడా భయపడుతుంటారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఓ అభిమాని తనకిష్టమైన హీరోయిన్ రష్మిక మందన ఇంటిని వెతుక్కుంటూ ఏకంగా తొమ్మిది వందల కిలోమీటర్ల ప్రయాణం చేశాడట.

    తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే రష్మిక అభిమాని. రష్మిక మందన అంటే ఎంతో ఇష్టం ఉండటంతో ఏకంగా తనను కలుసుకోవడానికి గూగుల్ ద్వారా తన ఇంటి అడ్రస్ ను కనుగొన్నాడు. కర్ణాటకలోని కొడగు సమీపంలో విరాజ్ పేట అని తెలుసుకొని మొత్తానికి 900 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడి వరకు చేరుకున్నాడు. మైసూర్ వరకు రైల్లో వెళ్లి అక్కడి నుండి ఓ ఆటో ద్వారా రష్మిక ఊరికి వెళ్ళాడు.

    ఇక అక్కడికి వెళ్ళాక రష్మిక ఇల్లు ఎక్కడ కనిపించకపోవడంతో అక్కడున్న ప్రతి ఒక్కరిని హీరోయిన్ రష్మిక ఇల్లు ఎక్కడ ఉంది అంటూ తెగ వెతికాడు. దీంతో అక్కడి ప్రజలు అతని ప్రవర్తన తేడాగా ఉండటం తో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు అతనిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. దీంతో ఆయన తన అభిమాన హీరోయిన్ రష్మిక కోసం వచ్చాడని తెలిపారు. ఇక రష్మిక షూటింగ్ కోసం ముంబై వెళ్లిందని ఆ వీరాభిమానికి చెప్పి వెనక్కి పంపించేశారు పోలీసులు. ఇక కొంతమంది అభిమానులు తమ అభిమాన నటులు ఏదైనా సెల్ఫీ విషయంలో లేదా సోషల్ మీడియా వేదికగా ముచ్చటించినప్పుడో స్పందించకపోతే చనిపోతామని బెదిరిస్తుంటారు కూడా. మొత్తానికి రష్మిక తన అభిమానులను ఏకంగా ఇంటి వరకు రప్పించుకునేలా చేస్తుంది.
    Published by:Navya Reddy
    First published: