• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD ACTRESS RAKUL PREET SINGH OPENS ABOUT HER FUTURE HUSBAND AND SAYS HER REQUIREMENTS PK

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలంట..

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలంట..

రకుల్ ప్రీత్ సింగ్ (Instagram/Rakul Preet Singh)

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో నితిన్ సరసన నటించిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌కు కాస్త దూరంగానే ఉంది రకుల్. దానికి కారణం హిందీలో ఈమె బిజీగా ఉండటమే.

  • Share this:
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో నితిన్ సరసన నటించిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌కు కాస్త దూరంగానే ఉంది రకుల్. దానికి కారణం హిందీలో ఈమె బిజీగా ఉండటమే. అక్కడ అజయ్ దేవ్‌గన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది రకుల్. దాంతో పాటు కుర్ర హీరోలతో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది రకుల్. లాక్‌డౌన్ తర్వాత అందరికంటే ముందుగా షూటింగ్స్‌కు హాజరైంది కూడా రకుల్ ప్రీత్ సింగే. అప్పట్నుంచి ఇప్పటి వరకు బిజీగానే ఉంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ఈమె పెళ్లిపై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలా రోజులుగా రకుల్ పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లు వాళ్లు అంటూ టాక్ వినిపిస్తున్నా కూడా ఎవరు అనేది మాత్రం కన్ఫర్మ్ చేయలేదు రకుల్. అయితే తనకు కాబోయే వాడు ఎలా ఉండాలనేది చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందులో ఆమె చెప్పిన క్వాలిటీస్ విన్న తర్వాత అంతా ఆహా రకుల్ మామూలు పిల్ల కాదు అంటూ చమత్కరిస్తున్నారు. వివాహ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకముందని చెబుతోంది రకుల్. పెళ్లిపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి నడిచే పవిత్ర బంధమే పెళ్లి అంటూ పెద్దపెద్ద పదాలే చెప్పింది ఈ బ్యూటీ.

రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Source: Twitter/Rakul Preet Singh)
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Source: Twitter/Rakul Preet Singh)


తనకు కాబోయే వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది కూడా చెప్పుకొచ్చింది రకుల్. అతడు తన కంటే చాలా పొడగరి అయివుండాలని కండీషన్ పెట్టింది రకుల్. దానికి కారణం కూడా చెప్పింది. కాబోయే వాడు ఎంత పొడుగ్గా ఉంటే తనను అంత తల ఎత్తుకునేలా చేస్తాడని చెప్తుంది రకుల్. హైహీల్స్ వేసుకున్నా కూడా అతనే పొడుగ్గా ఉండాలి.. దాంతో పాటు తెలివైన వాడై ఉండాలని కాబోయే భర్తకు కావాల్సిన లక్షణాలను చెప్పింది రకుల్.

రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Source: Twitter/Rakul Preet Singh)
రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Source: Twitter/Rakul Preet Singh)


దాంతో పాటు మరికొన్ని కండీషన్స్ కూడా పెట్టింది. మొత్తానికి ఈమె చెప్పిన లక్షణాల్లో డబ్బున్న వాడు మాత్రం లేదు.. బహుశా ఆమె దగ్గర ఉందనో.. లేదంటే అది చెప్పాల్సిన అవసరం లేదు కచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పాలనుకుంటుందో తెలియదు మరి. ఏదేమైనా కూడా రకుల్ ప్రీత్‌కు కాబోయే వాడు మాత్రం అయ్ బాబోయ్ ఎంత పొడుగో అనేలా ఉండాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు