• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD ACTRESS PRIYA MEETS YS SHARMILA IN HYDERABAD AND SUPPORTS HER NEW PARTY SK

YS Sharmila: షర్మిలను కలిసిన మరో నటి.. పార్టీ పెట్టక ముందే క్యూకట్టిన తారలు

YS Sharmila: షర్మిలను కలిసిన మరో నటి.. పార్టీ పెట్టక ముందే క్యూకట్టిన తారలు

వైఎస్ షర్మిల, ప్రియ

ఇప్పటికే ప్రముఖ యాంకర్ శ్యామలా రెడ్డి కూడా షర్మిల పొలిటికల్ ఇన్నింగ్స్‌కు మద్దతు తెలిపారు. తన భర్త నరసింహతో కలిసి కొన్ని రోజుల క్రితం లోటస్ పాండ్‌కు వెళ్లి షర్మిలను అభినందించారు.

  • Share this:
    తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గురించి కొన్ని రోజులుగా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆమె చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఆ తర్వాత వైఎస్ అభిమానులతో వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే కొత్త పార్టీని ప్రకటించేందుకు ఏర్పాట్లు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నేతలు, సినీ నటులు వైఎస్ షర్మిలను కలుస్తున్నారు. రాజకీయాల్లో వస్తున్నందుకు ఆమెను అభినందిస్తున్నారు. పార్టీ ప్రకటనకు ముందే క్యూ కడుతున్నారు. తాజాగా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీరియల్ నటి ప్రియ కూడా వైఎస్ షర్మిలను కలిశారు. శనివారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌లో షర్మిలను కలిసి మద్దతు తెలిపారు.

    ''చిన్నప్పటి నుంచి నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పెద్ద అభిమానిని. ఆయన్ను కలవాలని చాలా సార్లు అనుకున్నా. ఎవరి కాళ్లుకైనా దండం పెట్టాలంటే అమ్మానాన్నల తర్వాత నాకు ఆయనే గుర్తుకొస్తారు. వైఎస్ఆర్‌ను ఎప్పుడూ కలవలేకపోయాను. కానీ షర్మిల రాజకీయాల్లో వస్తున్నారని తెలిసి అభినందించడానికి వచ్చాను. ఆమెకు మద్దతు తెలుపుతున్నా. రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ వైఎస్ఆర్‌ను చూసి స్ఫూర్తి పొందాను. ప్రజలకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను.'' అని ప్రియ పేర్కొన్నారు.

    ఇప్పటికే ప్రముఖ యాంకర్ శ్యామలా రెడ్డి కూడా షర్మిల పొలిటికల్ ఇన్నింగ్స్‌కు మద్దతు తెలిపారు. తన భర్త నరసింహతో కలిసి కొన్ని రోజుల క్రితం లోటస్ పాండ్‌కు వెళ్లి షర్మిలను అభినందించారు. ఇక కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ ఆ పార్టీకి రాజీనామా చేసి షర్మిలలకు మద్దతు ప్రకటించారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కల్పనా రెడ్డి కూడా షర్మిల పెట్టబోయే పార్టీకి మద్దతు తెలిపారు. ఇక సోమవారం లోటస్ పాండ్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

    మరోవైపు ఆత్మీయ సమ్మేళనం పేరుతో వైఎస్ అభిమానులతో వైఎస్ షర్మిల వరుసగా భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి వైఎస్ షర్మిలారెడ్డి ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. ఏప్రిల్ 9న ఆమె కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఏప్రిల్ 9న ఆమె కొత్త రాజకీయ పార్టీని పెడతారని, ఖమ్మం జిల్లాలో లక్షమందితో బహిరంగ సభను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఏప్రిల్ 9న ముగిసింది. అందుకే అదే రోజున పార్టీని ప్రకటించాలని షర్మిల భావిస్తున్నారు. అనంతరం మే మొదటి వారంలో కొత్త పార్టీ ఆఫీసుకు శంకుస్థాపన చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు