Home /News /movies /

TOLLYWOOD ACTRESS PRAGYA JAISWAL SPECIAL SONG ON ANIL RAVIPUDI F3 FILM NR

Pragya Jaiswal - F3: ఎఫ్ 3లో బాలయ్య భామ స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే?

Anil Ravipudi F3

Anil Ravipudi F3

Pragya Jaiswal - F3: డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించగా వీరి సరసన మిల్క్ బ్యూటీ తమన్నా, యంగ్ బ్యూటీ మెహరీన్ హీరోయిన్స్ గా నటించారు.

ఇంకా చదవండి ...
    Pragya Jaiswal - F3: డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించగా వీరి సరసన మిల్క్ బ్యూటీ తమన్నా, యంగ్ బ్యూటీ మెహరీన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మించగా.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కి మంచి సక్సెస్ ను అందుకుంది. ఇదిలా ఉంటే మళ్లీ ఎఫ్ 3 తో ముందుకు తీసుకురానున్నాడు అనిల్ రావిపూడి.

    ఇక ఈసారి కూడా దిల్ రాజు నిర్మాతగా చేయనున్నారు. ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు తర్వాత రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో ఆలస్యం అయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్ జోరుగా నడుస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ఇక ఇందులో వెంకీ, వరుణ్ లతో పాటు తమన్నా, మెహరీన్ లు నటిస్తున్నారు. అంతేకాకుండా సునీల్, నటి సంగీత కూడా కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తుంది.

    ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు పూర్తి కాగా మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసారట. ఇందులో మరింత ఫన్ అండ్ ఫ్రస్టేషన్ డోస్ పెంచారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఓ హీరోయిన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు వరుణ్ తేజ్ నటించిన కంచె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈమెతో పాటు మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఈ స్పెషల్ సాంగ్ లో అలరించనుందట.



    ఇక ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా ఎఫ్2 కంటే మరింత ఎక్కువ సక్సెస్ ను అందిస్తున్నట్లు అర్థమవుతుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anil Ravipudi, F3 film, Pragya jaiswal, Special song, Varun Tej, Victory venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు